జియోసేఫ్, జియోట్రాన్స్‌లేట్ యాప్స్ లాంచ్ చేసిన రిలయన్స్.. వీటి ప్రత్యేకతలివే..??
జియోసేఫ్ కీ ఫీచర్స్‌లో 5- మెంబర్ సెక్యూర్ రూమ్ హైలెట్ గా నిలుస్తోంది. దీనితో 5 మంది సభ్యుల వరకు గ్రూప్ కాల్‌ల కోసం సెక్యూర్ రూమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకసారి రూమ్ సృష్టించి, ఎప్పుడైనా చేరవచ్చు. జియో ట్రూ 5g నెట్‌వర్క్ వాడినప్పుడు జియోసేఫ్ మరింత సురక్షితమైన కాల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది, సెన్సిటివ్ కాల్స్‌ను రక్షించడానికి ఎన్‌క్రిప్షన్, ఆథరైజేషన్ ఇంప్రూవ్ అవుతుంది.జియోసేఫ్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, భారతీయ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి నమోదు చేసుకోవాలి.
ఇక జియోట్రాన్స్‌లేట్ అనేది వాయిస్ కాల్, వాయిస్ మెసేజ్‌లు, టెక్స్ట్, ఇమేజ్‌లను అనువదించడానికి AI-శక్తితో కూడిన మల్టీ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ యాప్. ఇది ప్రయాణికులకు ఇండియాలోని వేరే ప్రాంతానికి పోయినప్పుడు భాషా పరమైన సమస్యలను అధిగమించడంలో, సులభంగా కమ్యూనికేట్ చేయడంలో సహాయపడుతుంది. జియోట్రాన్స్‌లేట్ ధర నెలకు రూ. 99. ఇది మొత్తం 12 పెద్ద భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఇన్‌స్టంట్ వాయిస్ ట్రాన్స్‌లేషన్ ఉంటుంది కాబట్టి వేరే భాష వ్యక్తితో మాట్లాడుతూ వెంటనే వారు చెప్పేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మనం చెప్పేది వారికి అర్థం అయ్యేలాగా వినిపించవచ్చు.అయితే జియో కస్టమర్లకు ఈ రెండు సేవలు మొదటి సంవత్సరం ఉచితంగా అందుబాటులో ఉంటాయి.