డాకూ మ‌హారాజ్ - గేమ్ ఛేంజ‌ర్ - సంక్రాంతికి వ‌స్తున్నాం.. మూడు సినిమాల బిజినెస్ లెక్క ఇది..!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్లు ద‌గ్గ‌ర ప‌డుతున్నాయి. ఈ మూడు సినిమాల బిజినెస్ లు అన్ని ఏరియాల‌కు క్లోజ్ అయిపోయాయి. బాల‌య్య డాకూ మ‌హారాజ్ - రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ - వెంక‌టేష్ సంక్రాంతికి వ‌స్తున్నాం మూడు సినిమాలు ఏరియాల వారీగా బిజినెస్ లు పూర్త‌య్యాయి. ఇందులో సంక్రాంతికి వ‌స్తున్నాం - గేమ్ ఛేంజ‌ర్ రెండు సినిమాలు దిల్ రాజు సొంత సినిమాలు ... ఇక బాల‌య్య సినిమా ను కూడా నైజాంలో ఆయ‌నే పంపిణీ చేస్తున్నారు. మూడు సినిమాలు నైజాంలో దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు.

ఇక గేమ్ ఛేంజ‌ర్‌, సంక్రాంతికి వ‌స్తున్నాం ఈ రెండు సినిమాలు క‌లిపి ఆంధ్రా మొత్తం ( సీడెడ్ కాకుండా ) హోల్ సేల్ గా రు. 80 కోట్ల‌కు ఇచ్చేశారు. ఇందులో గేమ్ ఛేంజ‌ర్ రు. 65 కోట్లు, సంక్రాంతికి వ‌స్తున్నాం రు. 15 కోట్ల లెక్క‌న ఇచ్చారు. ఎక్కువ త‌క్కువ‌లు ఈ రెండు సినిమాల‌కు క‌లిపి స‌ర్దుబాట్లు ఉంటాయి. వైజాగ్ ఏరియాను రెండు సినిమాల‌కు క‌లిపి దిల్ రాజే ఓన్ గా పంపిణీ చేసుకుంటారు. ఇవే రెండు సినిమాలు క‌లిపి సీడెడ్ కు రు. 27 కోట్ల‌కు అమ్మారు. ఇందులో గేమ్ ఛేంజ‌ర్ రు. 22 కోట్లు.. సంక్రాంతికి వ‌స్తున్నాం రు. 5 కోట్ల లెక్క‌న అమ్మారు.

ఇక బాల‌య్య డాకూ మ‌హారాజ్ విష‌యానికి వ‌స్తే నైజాం ఏరియాకు రు. 18 కోట్ల‌కు అమ్మారు. ఏపీలో సీడెడ్ మిన‌హాయించి మిగిలిన ఏరియాల‌కు రు. 40 కోట్ల‌కు అమ్మారు. మొత్తం మీద మూడు సినిమాలు కలిపి ఏపీ, తెలంగాణ లో రు. 200 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేశాయి. అంటే మూడు సినిమాలు క‌లిపి రు. 200 కోట్ల పైనే టార్గెట్ తో బ‌రిలోకి దిగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: