ప్రోటీన్ ఆహారం తీసుకుంటే అధికంగా నీళ్లు తాగాలా..?
నీరు మన శరీరంలో వివిధ రకాల జీవక్రియలను నిర్వహించడానికి సహాయపడుతుంది. దీనిపై పోషకాహార నిపుణురాలు అమిత గాద్రే ఏం చెబుతున్నారంటే... ఎక్కువ ప్రోటీన్లు తిన్నప్పుడు హైడ్రేటెడ్ గా ఉండటం అవసరం. శరీరంలోకి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం పెరిగితే, మీరు ఎక్కువగా నీరు తాగాలి? ఎందుకంటే... అధిక ప్రోటీన్ ఆహారం మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఎందుకంటే శరీరం యూరియా వంటి వ్యర్థ పదార్థాలను ఎక్కువగా ఉత్పత్తి చేసే విసర్జిస్తుంది. ఇది కిడ్నీలు ఎఫెక్టివ్ గా పని చేయడానికి సహాయపడుతుంది. ఇది తగినంతగా హైడ్రేట్ గా ఉండాలి. ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం జీర్ణ వ్యవస్థకు కూడా మంచిది.
మీరు భోజనంలో 25 రాముల కంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే, శరీరం ఒకేసారి జీర్ణం కష్టపడుతుంది. అలాకాకుండా ప్రోటీన్ తీసుకోవటం క్రమంగా పెంచడం ద్వారా, జీర్ణ వ్యవస్థకు తగినంత సమయం లభిస్తుంది. ఇలా జరగాలంటే శరీరంలోకి తగినంత నీటిని తీసుకోవాలి. ప్రోటిన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే, అంతే మోతాదులో నీరు కూడా తీసుకోవాలి. కండరాల పెరుగుదలను ప్రోత్సహించడానికి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. నిర్జలీకరణం కండరాల తిమ్మిరి, అలసట వంటివి ప్రోటీన్ కు అంతరాయం కలిగించవచ్చు. కాబట్టి మీ ఆహారంతో పాటు నీరు కూడా తగినంత తీసుకోవడం చాలా ముఖ్యం.