జేసీ ప్రభాకర్ కు టాలీవుడ్ హీరోయిన్ కౌంటర్... చంపేస్తే చంపు అంటూ?
అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని.. ఆరోపణలు చేశారు మాధవి లత. అయితే దీనిపై వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. మాధవి లతను ప్రాస్టిట్యూట్ అంటూ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు జెసి ప్రభాకర్ రెడ్డి. మల్లెపూలు పెట్టుకుని తిరిగే అమ్మాయి అంటూ.. ఆమెపై ఫైర్ అయ్యారు ప్రభాకర్ రెడ్డి. అలాగే బిజెపి పార్టీ పైన కూడా అన్నిప్పులు జరిగారు జేసీ ప్రభాకర్ రెడ్డి. బిజెపి ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుందని కొనియాడారు.
అయితే జెసి ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్లకు... కాసేపటి క్రితమే మాధవి లత కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన నటి, బీజేపీ నేత మాధవి లత... తన స్టైల్ లో కామెంట్స్ చేశారు. నన్ను చంపాలనుకుంటే చంపొచ్చు.. కానీ మహిళల మాన, ప్రాణాల విషయంలో వెనక్కి తగ్గను అంటూ రెచ్చిపోయారు.
తెర మీద కనిపించే మహిళలు క్యారెక్టర్‌లెస్, గలీజ్ వాళ్లు అని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు హీరోయిన్ మాధవి లత.. మరి తాడిపత్రి వాళ్లు పతివ్రతలు కాబట్టి ఎవరూ సినిమా రంగంలోకి రాకండి అంటూ తేల్చి చెప్పారు మాధవి లత. ఈ అటు జేసి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై... ఏపీ మంత్రి సత్య కుమార్ స్పందించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జెసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడాలని చురకలాంటించారు సత్య కుమార్.