ఏంటి యంగ్ హీరోయిన్ శ్రీలీల ప్రేమలో పడిందా.. టాలీవుడ్ సెలబ్రిటీలను వదిలేసి ఆ బాలీవుడ్ హీరోతో శ్రీలీల నిజంగానే ప్రేమలో ఉందా అనేది ఇప్పుడు చూద్దాం.. పెళ్లి సందD, ధమాకా,స్కంద,భగవంత్ కేసరి, గుంటూరు కారం, ఆదికేశవ వంటి సినిమాల్లో నటించిన శ్రీలిల కొద్ది రోజుల్లోనే టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా బాలీవుడ్ హీరోతో ప్రేమలో పడింది అంటూ ఓ నిర్మాత అఫీషియల్ గా బయట పెట్టేశారు. మరి ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే కార్తీక్ ఆర్యన్.. బాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన కార్తీక్ ఆర్యన్ అంటే సౌత్ ఇండస్ట్రీ ప్రేక్షకులకు తెలియకపోయినప్పటికీ నార్త్ ఇండస్ట్రీలో ఈయన ఫేమస్ నటుడే.అయితే కార్తిక్ ఆర్యన్ తో శ్రీ లీల ప్రేమలో పడ్డట్టు నిర్మాత కరణ్ జోహార్ అఫీషియల్ గా బయటపెట్టేశారు.
ఇక శ్రీలీల కార్తిక్ ఆర్యన్ తో ప్రేమలో పడడం అంటే అందరూ నిజంగానే అనుకుంటారు.కానీ అది నిజం కాదు.వీరిద్దరిది రియల్ ప్రేమ కాదు రీల్ ప్రేమ.. శ్రీలీల కార్తిక్ ఆర్యన్ కాంబినేషన్లో కరణ్ జోహార్ నిర్మాతగా ఒక అద్భుతమైన లవ్ స్టోరీ తెరకెక్కబోతుందట. అయితే ఈ లవ్ స్టోరీ నేపథ్యంలో రాబోతున్న సినిమా పేరు "తు మేరీ మై తేరా.. మై తేరా తుమ్ మేరీ".తాజాగా ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసారు కరణ్ జోహార్. అయితే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన సమయంలో కరణ్ జోహార్ మాట్లాడుతూ..నేను ఇప్పటికే మూడుసార్లు లవ్లో విఫలమయ్యాను.
నాలుగో సారి కూడా ప్రేమలో పడబోతున్నాను.కానీ ఇది ముందులాగా జరగకూడదని నేను కోరుకుంటున్నాను అంటూ కరణ్ జోహార్ చెప్పుకొచ్చారు. అయితే శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ కార్తిక్ ఆర్యన్ తో ఉండబోతుంది అని తెలిశాక చాలామంది శ్రీలీల ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. మరి శ్రీ లీల బాలీవుడ్లో నిలదొక్కుకోగలుగుతుందా..లేక మిగతా హీరోయిన్ల లాగే బాలీవుడ్ లో రెండు మూడు సినిమాల్లో మెరిసి మళ్లీ సౌత్ ఇండస్ట్రీనే దిక్కు అని తెలుసుకుంటుందా అనేది చూడాలి