ఇండియ‌న్ సినీ స్క్రీన్‌పై ఫ‌స్ట్‌ పొలిటిక‌ల్ హీరో జ‌గ్గ‌య్య‌... చెక్కు చెద‌ర‌ని రికార్డు...?

RAMAKRISHNA S.S.
- ఎన్టీఆర్‌తో క‌లిసి కాలేజ్ రోజుల్లోనే నాట‌కాల్లో హీరో
- నెహ్రూ పిలుపు మేర‌కు పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరిన జ‌గ్గ‌య్య‌
- భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో ఎంపీ అయిన ఫ‌స్ట్ హీరో
( ప్ర‌కాశం - ఇండియా హెరాల్డ్ )
కొంగర జగ్గయ్య క‌ళా వాచ‌స్ప‌తి.. కంచుకంఠం జ‌గ్గ‌య్య అని ప్ర‌సిద్ధి. తెలుగు సినీ రంగంలో 1950 - 80వ ద‌శ‌కంలో కీల‌క న‌టుడు. జ‌గ్గ‌య్య న‌టుడు మాత్ర‌మే కాదు... సాహిత్యవేత్త, పాత్రికేయుడు, గేయ రచయిత, డబ్బింగ్ కళాకారుడు మరియు రాజకీయ నాయకుడు, ప్రధానంగా తెలుగు సినిమా మరియు తెలుగు థియేటర్ రంగంలో త‌న‌ రచనలతో ప్రసిద్ధి చెందాడు . ఈ క్ర‌మంలోనే కంచుకంఠం జ‌గ్గ‌య్య‌గా పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చుకున్నారు. 40 ఏళ్ల సినీజీవితంలో ఆయ‌న ప్ర‌ధాన న‌టుడుగానే కాకుండా.. కొన్ని సినిమాల్లో విల‌న్ పాత్ర‌ల్లోనూ న‌టించి మెప్పించారు.

ఇక జ‌గ్గ‌య్య సినీ రంగం నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన తొలి త‌రం న‌టుల‌లో ప్ర‌ధానంగా ముందు వ‌రుస‌లో ఉంటారు. జగ్గయ్య గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని మోరంపూడి గ్రామంలో సీతారామయ్య, రాజ్య లక్ష్మమ్మ దంపతులకు 1928 డిసెంబర్ 31న జన్మించారు . 11 సంవత్సరాల వయస్సులో దుగ్గిరాలలో హైస్కూల్ చదువుతున్న రోజుల్లో హిందీ నాటకంలో లవ పాత్రతో నటించి పాపుల‌ర్ అయ్యారు. గుంటూరు ఏసీ కాలేజ్‌లో చ‌దువుతున్న‌ప్పుడు ఎన్టీఆర్‌తో క‌లిసి ప‌లు నాట‌కాలు వేశారు.

విద్యార్థిగా ఉన్న‌ సమయంలో భారత స్వాతంత్య్ర‌ ఉద్యమంలో పాల్గొన్న తెనాలిలోని కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో చేరాడు. ఆ త‌ర్వాత జ‌ర్న‌లిస్టుగా కూడా ప‌నిచేశారు. రిప‌బ్లిక్ వార‌ప‌త్రిక సంపాద‌కుడిగా ఉన్నారు. ఆ త‌ర్వాత ఆకాశ‌వాణిలోనూ కొంత‌కాలం ప‌నిచేశారు. జ‌గ్గ‌య్య ముందు కాంగ్రెస్ పార్టీలోని సోష‌లిస్టు గ్రూప్లో యాక్టివ్‌గా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత అది ర‌ద్దు కావ‌డంతో జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ నేతృత్వంలోని ప్ర‌జా సోష‌లిస్టు పార్టీలో చేరారు. అయితే 1956లో జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ పిలుపు మేర‌కు ఆయ‌న తిరిగి కాంగ్రెస్‌లో చేరారు.

ఈ క్ర‌మంలోనే 1967లో జ‌గ్గ‌య్య‌ ఒంగోలు నియోజకవర్గం నుండి నాల్గవ లోక్‌సభ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నికయ్యాడు. పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన మొట్టమొదటి భారతీయ చలనచిత్ర నటుడిగా గుర్తింపు పొందాడు. ఈ రికార్డు భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో జ‌గ్గ‌య్య పేరిట ల‌ఖించ‌బ‌డి పోయింది. ఆ త‌ర్వాత రాజ‌కీయంగా అంత యాక్టివ్‌గా లేక‌పోయినా కాంగ్రెస్‌తో అనుబంధం కొన‌సాగించి 2004లో చెన్నైలో మృతిచెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: