వీడేం ఉద్యోగి.. ముసలాళ్ల పెన్షన్‌ సొమ్ము సొంతానికి వాడేసుకున్నాడు?

Chakravarthi Kalyan
ఏపీలో పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. అయితే అక్కడక్కడా పెన్షన్ల  పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయి. అక్రమాలకు పాల్పడినందుకు ప్రొద్దుటూరు ఏడో సచివాలయం మౌలిక సదుపాయాల కార్యదర్శి మురళీ మోహన్ పై సస్పెన్షన్ వేటు పడింది. మురళీమోహన్ సస్పెండ్ చేస్తూ  పురపాలక కమిషనర్ రఘునాథ్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ఇంతకీ మురళీ మోహన్ ఏం చేశాడంటే.. ప్రభుత్వం ఇచ్చిన ఫించన్ డబ్బును సొంతానికి ఉపయోగించుకున్నాడు.  

చెడు వ్యసనాలకు అలవాడు పడిన మౌలిక సదుపాయాల కార్యదర్శి మురళీ మోహన్ వృద్దులకు ఇవ్వాల్సిన ఫించన్ డబ్బు రూ.4 లక్షలను సొంతానికి వాడుకున్నాడు. ఆ తర్వాత ఆ డబ్బు  దుండగులు అపహారించారంటూ డ్రామా ఆడాడు. పురపాలక అధికారుల ఫిర్యాదుతో మురళీ మోహన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ సాగిస్తున్నారు. నిన్ననే మరో చోట పెన్షన్‌ సొమ్ములో కొంత మినహాయించుంటూ కక్కుర్తి పడిన మరో ఉద్యోగిని కూడా ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: