RRR స్టైల్‌లో మెగా-విక్టరీ సర్ ప్రైజ్: చిరంజీవి, వెంకటేష్ మల్టీస్టారర్ సాంగ్!

Amruth kumar
టాలీవుడ్‌లో ఇప్పుడు మల్టీస్టారర్ల హవా నడుస్తోంది. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బడా స్టార్లను చూస్తే ఆడియన్స్‌కు వచ్చే కిక్ వేరు. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి వేసిన 'నాటు నాటు' డ్యాన్స్ ప్రపంచాన్ని ఊపేసింది. ఇప్పుడు సరిగ్గా అలాంటి మాస్ మ్యాజిక్‌ను సీనియర్ హీరోలతో రిపీట్ చేయడానికి రంగం సిద్ధమైందని సినీ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. ఆ ఇద్దరు లెజెండ్స్ మరెవరో కాదు... మన మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్!చిరు సినిమాలో వెంకీ స్పెషల్ రోల్! .. ఈ క్రేజీ కాంబినేషన్‌ను తెరపైకి తీసుకురావడానికి ప్లాన్ చేసింది సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.

 

ఇక ప్రస్తుతం చిరంజీవితో ఆయన 'మన శంకర వరప్రసాద్' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక స్పెషల్ రోల్‌లో కనిపించబోతున్నారనేది తాజా సమాచారం. అయితే, ఇది కేవలం అతిథి పాత్రగా వచ్చి వెళ్ళేది కాదని, ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించేలా ఒక అదిరిపోయే మాస్ సాంగ్‌ను ప్లాన్ చేశారనేది పక్కా టాక్. 'హుక్ స్టెప్'తో బాక్సాఫీస్ షేక్! .. 'ఆర్ఆర్ఆర్' స్థాయిలో కాకపోయినా, ఈ పాటలో చిరంజీవి, వెంకటేష్ కలిసి స్టైలిష్ హుక్ స్టెప్స్‌తో డ్యాన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. వీరిద్దరి కోసం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఇప్పటికే ఒక ఊర మాస్ ట్యూన్‌ను రెడీ చేశారట.

 

ఈ పాటలో ఒక సిగ్నేచర్ 'హుక్ స్టెప్' ఉంటుందని, అది రిలీజ్ అయితే సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయమని ఇండస్ట్రీలో ఇన్‌సైడ్ టాక్. దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ ఒకే పాటలో, ఒకే ఫ్రేమ్‌లో కలిసి కనిపిస్తే ఆ హైప్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది అనడంలో సందేహం లేదు. అనిల్ రావిపూడికి వెంకటేష్‌తో ఉన్న మంచి బాండింగ్ ('ఎఫ్2', 'ఎఫ్3' సినిమాలు) కారణంగానే ఈ అద్భుతమైన కాంబినేషన్ సెట్ అయింది. తెరపై వీరిద్దరి కామెడీ టైమింగ్తో పాటు, ఈ డ్యాన్స్ ఎపిసోడ్ సినిమాకే బిగ్గెస్ట్ హైలైట్‌గా నిలుస్తుందట. ఇప్పటికే భారీ అంచనాలున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగనుంది. సినిమాలో ఈ 'డబుల్ ధమాకా' సాంగ్ ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: