రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ నుండి తప్పించుకోవడానికి మహేష్ బాబు మాస్టర్ ప్లాన్..!

Thota Jaya Madhuri
మనందరికీ తెలిసిందే—తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటివరకు ఓ మాట అన్నది బాగా నిజమేనని అంతా నమ్ముతూ వచ్చారు. "ఎవరు అయినా హీరో రాజమౌళి సినిమా చేసిన తరువాత వచ్చే నెక్స్ట్ సినిమా మాత్రం ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది" అనే నమ్మకం ఇండస్ట్రీలో ఒక నెగిటివ్ సెంటిమెంట్‌గా బలంగా ఉంది. ఇది కేవలం అభిమానులు లేదా ట్రేడ్ వర్గాల మాట మాత్రమే కాకుండా, గత చరిత్ర చెబుతున్న నిజమే అని చాలా మంది చెబుతుంటారు. రాజమౌళి సినిమా హీరోలు ఎవ్వరు ఆ ఫ్లాప్ సెంటి మెంట్ నుండి తప్పించుకోలేరు. ఇప్పుడేమో ఇదే చర్చ మరోసారి టాప్ ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కాకుండా గ్లోబల్ లెవెల్‌లో కూడా అంచనాలు పెంచేస్తున్న రాజమౌళి–మహేష్ బాబు కాంబినేషన్. తాజాగా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా “వారణాసి” అని నామకరణం చేయడంతో, సినిమాపై క్రియేట్ అవుతున్న హైప్ మరింత రెట్టింపు అయింది.



సినిమా ప్రారంభం కాకముందే ఇంటర్నేషనల్ మీడియా దృష్టిలోకూ ఈ ప్రాజెక్ట్ వెళ్లిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మహేష్ బాబు పేరు రికార్డులు తిరగరాయటానికి సిద్ధమవుతుందన్న రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. అయితే అభిమానుల్లోనూ, సోషల్ మీడియాలోనూ ఒకే ప్రశ్న గట్టిగానే వినిపిస్తోంది— “రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు చేసే సినిమా కూడా ఫ్లాప్ అవుతుందా? ఈ సెంటిమెంట్ నుండి ఆయన తప్పించుకోగలడా?” ఇప్పుడేమో మరో కొత్త వార్తా చర్చ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారమేంటి అంటే— ఈ నెగిటివ్ రాజమౌళి సెంటిమెంట్ నుండి బయటపడడానికి మహేష్ బాబు ముందుగానే స్ట్రాంగ్ ప్లాన్ వేసుకున్నాడట.


‘వారణాసి’ సినిమాను రెండు భాగాలుగా రూపొందించాలనే ఆలోచన రాజమౌళికి ఉందట. దీని కోసం మహేష్ బాబు కూడా పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాడని, రెండు పార్ట్స్‌కు వెంట వెంటనే కాల్షీట్స్ ఇవ్వడానికి అనుమతి తెలిపినట్టుగా టాక్ వినిపిస్తోంది.ఈ స్ట్రాటజీ ద్వారా—వాల్యూ తగ్గకుండా, అంచనాలు కంటిన్యూ అవుతూ, హీరోకు "తదుపరి సినిమా" అనే పరిస్థితి వెంటనే రాకుండా, రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్‌ను పూర్తిగా బ్రేక్ చేయొచ్చని భావిస్తున్నారట.



ఈ వార్త నిజమా కాదా అనేది అధికారికంగా ప్రకటించలేదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ రూమర్, ఈ డిస్కషన్ గట్టిగా వైరల్ అవుతుంది. ఇప్పుడు అందరి దృష్టి ఒకే ప్రశ్నపై నిలిచిపోయింది— “వారణాసి నిజంగానే రెండు పార్ట్స్‌గా వస్తుందా? వెంట వెంటనే రెండూ రిలీజ్ అవుతాయా? లేదా మహేష్ బాబు కూడా మిగతా స్టార్ హీరోల్లాగే ఆ సెంటిమెంట్ బారిన పడాల్సి వస్తుందా?” ఇందుకు సమాధానం చెప్పేది ఒక్కటే— కాలమే. అంతవరకు ఈ హైప్, ఈ అంచనాలు, ఈ రూమర్స్ే సోషల్ మీడియాలో ఇండస్ట్రీని షేక్ చేస్తుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: