బాబు మామూలోడు కాదు: జగన్‌ మూడు రోజుల్లో చేయలేనిది ఒక్కరోజే చేసేశాడుగా?

పెన్షన్లు ఇవ్వాలంటే గతంలో జగన్ ప్రభుత్వం వాలంటీర్లపై ఆధారపడేవారు. వాలంటీర్లు ప్రతినెలా ఉదయాన్నే ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు ఇచ్చేవాళ్లు.. గత ఎన్నికల ముందు.. వాలంటీర్లు పెన్షన్లు పంచొద్దని ఈసీ నిబంధన విధించింది. దాంతో పెన్షన్ల పంపిణీ రచ్చ రచ్చ అయ్యింది. పెన్షన్‌ కోసం సచివాలయాలకు వెళ్లే సమయంలో కొందరు వృద్ధులకు ఎండలకు మృత్యువాత పడ్డారు. వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఇవ్వడం కష్టమని జగన్ సర్కారు అప్పట్లో చెప్పకనే చెప్పింది.

కానీ ఇప్పుడు అదే ప్రభుత్వంతో చంద్రబాబు వాలంటీర్లు లేకుండానే సచివాలయ ఉద్యోగులతోనే పెన్షన్లు ఇప్పించారు. అది కూడా తొలిరోజే 94 శాతం పెన్షన్లు పంపిణీ చేసేశారు. 94 శాతం అంటే దాదాపు అందరికీ ఇచ్చినట్టే. పెన్షన్ల ద్వారా ఒకే రోజు 12 గంటల్లో 4170 కోట్ల రూపాయలు పంపిణీ జరిగింది. గతంలో ఎన్నడూ ఇలా ఎవరూ చేయలేదని చెప్పొచ్చు. ఉదయం నుంచీ సాయంత్రం ఏడు  వరకు 94.15 శాతం పెన్షన్ పంపిణీ చేశారు. గతంలో 2.65  లక్షల మంది వాలంటీర్లు ఉన్నా ఈ స్థాయిలో ఇవ్వలేదు.

1.30 లక్షల మంది సచివాలయం సిబ్బందితోనే చంద్రబాబు ఈ రికార్డు సాధించారు. దీంతో గత రెండు నెలల్లో పెన్షన్ ఉద్దేశపూర్వకంగా గత ప్రభుత్వం ఆపేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వాలంటీర్లు లేకుండా పెన్షన్ పంపిణీ సాధ్యం కాదని అడ్డగోలు నిబంధనలు పెట్టారని.. వారికి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల కొంతమంది చనిపోయారని విమర్శిస్తున్నారు. చంద్రబాబు చిత్తశుద్ధికి.. ఉద్యోగుల కష్టానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు.

సమర్ధవంతమైన నాయకత్వం వల్లే ఈరోజు పెన్షన్ పంపిణీ రికార్డు స్థాయిలో జరిగిందంటున్న టీడీపీ నేతలు.. ఎక్కడకి‌ వెళ్లినా  పెన్షన్ దారులు ఆనందంతో పండుగ చేసుకున్నారని చెబుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా నాలుగు వేలు పెన్షన్, బకాయి మూడు‌వేలు కలిపి ఏడు‌వేలు ఇచ్చాని.. 28 కేటగిరీల్లో 4408 కోట్లు నేడు పంపిణీ చేశాని చెబుతున్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లకు వెయ్యి పెంచితే.. చంద్రబాబు 17 రోజుల‌ పాలనలోనే  పెంచారని లెక్కలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: