క‌ల్కి 2898 AD : ఫ‌స్ట్ డే RRR - స‌లార్ సినిమాల రికార్డుల‌కు పాత‌రేసిన ప్ర‌భాస్ రాజు

RAMAKRISHNA S.S.
విడుదలకు ముందే కల్కి 2898 ఏడీ ఎన్నో రికార్డులు క్రియేట్ చేయ‌డం స్టార్ట్ చేసింది. తాజాగా రిలీజ్‌ ఫస్ట్‌డేనే కల్కి ఏకంగా ఎన్టీఆర్ - రామ్ చ‌ర‌ణ్ - ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి కాంబినేష‌న్లో వ‌చ్చిన‌ ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డునే బ్రేక్‌ చేసింది. ఇండియన్‌ మూవీ లవర్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ క‌ల్కి సినిమా ఈ రోజు భారీ అంచ‌నాల మ‌ధ్య థియేట‌ర్ల లోకి వ‌చ్చింది. తెల్ల వారు ఝామున 4 గంట‌ల‌కే ఆంధ్రా, తెలంగాణ అంతా షోలు ప‌డిపోయాయి. సినిమాకు ఆట ఆట‌కు టాక్ మ‌రింత పాజిటివ్ గా పెరిగిపోతోంది.

ఇక ఓవ‌ర్సీస్ లో అయితే క‌ల్కి దెబ్బ‌కు థియేట‌ర్లు ఠారెత్తి పోతున్నాయి. అక్కడ అడ్వాన్స్‌ బుకింగ్‌ టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తొలి రోజు ఇప్ప‌టికి అందిని స‌మాచారం ప్ర‌కార‌మే ఏకంగా  టికెట్లు 1,25,000 అమ్ముడైనట్టు సమాచారం.  ఈ క్రమంలో కల్కి తొలి రోజే ప్రీమియర్‌ షోతోనే మిలియన్ల కొద్ది డాలర్లు కలెక్షన్స్‌ రాబట్టి దూసుకు పోతోంది.

ఇక రిలీజ్‌కు ప‌ది రోజుల ముందే అమెరికాలో క‌ల్కి అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. నార్త్‌ అమెరికాలో అడ్వాన్స్‌ బుకింగ్‌లో కల్కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ తో దూసుకు పోతోంది. ఫస్ట్ డే రాత్రి షో వరకు కల్కి అడ్వాన్స్ బుకింగ్‌ ద్వారా ఏకంగా 3.5 మిలియన్‌ డాలర్లకు పైగా వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. ఈ క్ర‌మంలోనే నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ లో ఫస్ట్‌ డే కలెక్షన్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్ - సలార్ సినిమా ల రికార్డును కల్కి బ్రేక్‌ చేసింది. ఆర్‌ఆర్‌ఆర్ క్లోజింగ్‌ కలెక్షన్స్‌ని కల్కి ప్రీమియర్ షో క‌లెక్ష‌న్ల తోనే దాటేసింది. ఏదేమైనా తొలి రోజు క‌ల్కి సినిమా వ‌సూళ్లు చూస్తుంటే ఏరియాల వారీగా చాలా రికార్డులు బ్రేక్ అయ్యేలా క‌నిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: