వైసీపీ విడ‌ద‌ల ర‌జ‌నీ వ‌సూళ్ల‌కు అంతే లేదా... ఎన్ని కోట్లు వ‌సూళ్లు సామి..?

RAMAKRISHNA S.S.
వైసీపీ లో ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి విడదల రజనీ ఎక్కడ తనపై కేసులు పడతాయో అని కంగారు పడుతున్నట్టు టాక్ ? ఒక‌ప్పుడు చంద్ర‌బాబు.. చిల‌క‌లూరిపేట‌కు చెందిన మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు ప్రాప‌కంతో రాజ‌కీయంగా పుంజుకున్న ర‌జ‌నీ అనూహ్యంగా గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ( 2019 ఎన్నిక‌లు ) వైసీపీలో చేరి చిల‌క‌లూరిపేట లో వైసీపీ సీటు ద‌క్కించుకుని ప్ర‌త్తిపాటి పుల్లారావునే ఓడించారు. అనూహ్యంగా మంత్రి కూడా అయిపోయారు.

వైసీపీ ఎమ్మెల్యే గా ఉన్న‌ప్పుడు.. అటు మంత్రి అయిన‌ప్పుడు ర‌జ‌నీ ఓ వెలుగు వెలిగారు. అధికారం మామూలుగా చెలాయించ‌లేదు. ఈ క్ర‌మంలోనే ఆమె మంత్రి అయ్యాక చేసిన దందాలు.. చేసిన వ‌సూళ్లు అంటూ ఇప్పుడు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఏపీలో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో చిలుకలూరిపేటలో ఆమె చేసిన దందాల వల్ల నష్టపోయిన వాళ్లం అంటూ తెరపైకి వస్తున్నారు. మ‌రి కొంద‌రు త‌మ‌కు జ‌రిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.

ఇక్క‌డే అస‌లు క‌థ న‌డుస్తోంది. ఈ కేసుల గురించి తెలిసిన ర‌జ‌నీ వాళ్లు కేసుల వ‌ర‌కు వెళ్ల‌కుండానే తాను తీసుకున్న‌ డబ్బులు వెనక్కించేందుకు విడదల రజనీ ఒప్పందం చేసుకుంటున్నార‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఒకరిద్ద‌రి ద‌గ్గ‌ర వసూలు చేసిన అమౌంట్ వెన‌క్కు ఇవ్వ‌డంతో ఇప్పుడు ఆమె బాధితుల్లో చాలా మంది కూడా మా డ‌బ్బులు కూడా వెన‌క్కు ఇవ్వాలంటూ తెర మీద‌కు వ‌స్తోన్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ఏదేమైనా అధికారం ఉన్న‌ప్పుడు దానికి ఎంజాయ్ చేయ‌డం కాదు... వెలుగు వెల‌గ‌డం కాదు... ప్ర‌తిప‌క్షం లో ఉన్న‌ప్పుడు ఎలా నిల‌బ‌డాలో అన్న‌ది ఇప్పుడు ర‌జ‌నీకి బాగా తెలిసి వ‌స్తోంద‌న్న సెటైర్లు పేలుతున్నాయి. ఒక్క ఓట‌మి దెబ్బ‌కు మాజీ మంత్రి విడదల రజనీకి ఉక్కపోత ప్రారంభమయింది. ఎంత సొమ్మ అని తెచ్చివ్వాలని.. తాము ఎన్నికల్లో ఖర్చు పెట్టేసుకున్నామని ఆమె గగ్గోలు పెడుతున్నార‌ట‌. ఇక ఆమె బీజేపీ లోకి వెళ్లే ప్ర‌య‌త్నాలు కూడా మొద‌లు పెట్టార‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: