ఏపీ హోం మినిస్ట‌ర్‌... పోలీస్ శాఖ‌లో భారీ నోటిపికేష‌న్‌...?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు... అదిరిపోయే శుభవార్త చెప్పారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. ఇవాళ డీజీపీగా తిరుమల రావు బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో హోం మంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసు రిక్రూట్మెంట్ పై కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్‌ రిక్రూట్‌మెంట్ అవసరం ఉందన్నారు మంత్రి వంగలపూడి అనిత. పోలీస్‌ శాఖలో ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ విధానం ఉండాలి. గత ప్రభుత్వంలో నమోదైన అక్రమ కేసులపై కమిటీ వేసి విచారణ చేస్తామని వెల్లడించారు. రెడ్‌ బుక్‌ కక్ష సాధింపు చర్య కాదని చెప్పారు మంత్రి వంగలపూడి అనిత.

గత ఐదేళ్ళు పోలీసు వ్యవస్ధ నిర్లక్ష్యం చేయబడింది... పోలీస్ డిపార్టుమెంటుకు ఏం కావాలని అనే అంశాలు పట్టించుకోలేదని ఆగ్రహించారు. పోలీసు అకాడమీ, గ్రేహౌండ్ అకాడమీ లేదు..కేంద్రం నుంచీ నిధులు వచ్చినా గత ప్రభుత్వం అకాడమీ పెట్టలేదని చెప్పారు. గంజా... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయింది... మహిళలపై నేరాలు విషయంలో ప్రత్యేక చర్యలు అవసరమానరు హోంమంత్రి వంగలపూడి అనిత. విశాఖలో ఆరిలోవ పోలీసు స్టేషన్ రేకుల షెడ్డులో, చెట్ల కింద ఉందన్నారు.

పాత ప్రభుత్వాన్ని ఎత్తి చూపడం కాదు‌.... ఎస్కార్టు వాహనాలు 2014 తరువాత మెయింటెనెన్స్ లేవు..పోలీసు స్టేషన్లకు గత ఐదేళ్ళలో నెలనెలా ఇచ్చే స్టేషనరీ ఖర్చులు ఇవ్వలేదన్నారు. పొలీసు రిక్రూట్మెంట్ చాలా అవసరం ఉంది ఇప్పుడు..వ్రాత పరీక్షతో మహిళా సంరక్షణ కార్యదర్శులు అంటూ పోలీసులను చేసేసారని చెప్పారు హోంమంత్రి వంగలపూడి అనిత.  పోలీసులు అంటే ప్రత్యేక రిక్రూట్మెంట్ విధానం ఉంది... సీఐడీ నిన్నటి వరకూ ఎలా పని చేసిందో అందరికీ తెలుసు అన్నారు.

పీపుల్ పార్టనర్ షిప్ తో పోలీసు డిపార్ట్మెంట్ లో మార్పులు తెచ్చే దిశగా చర్చించామని... డిజిపి అధ్యక్షతన మా సమావేశం జరిగింది..
పోలీసు అంటే ఎవరూ భయపడకూడదు.. ఏ కష్టమైనా చెప్పుకోవచ్చనే ధీమా రావాలన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత.
పోలీసులకు, పబ్లిక్ కి మధ్యలో సరైన సంబంధాలు ఉండాలి..16 నుంచీ 21 సంవత్సరాల వయసు మధ్య మహిళలు మిస్సింగ్ లో ఉంటున్నారని పేర్కొన్నారు.  గత ఐదేళ్ళు ప్రతిపక్షాలను భయాందోళనలకు గురి చేయడానికి పోలీసులను ఉపయోగించారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: