బీజేపీ: చిన్నమ్మకు స్పీకర్ పదవి దక్కకపోవడం వెనుక ఇంత కథ ఉందా..?

Divya
గత రెండుసార్లు సొంతంగా మెజారిటీ సాధించిన బిజెపి పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని స్వయంగానే ఏర్పాటు చేసుకుంది.. బిజెపికి ఈసారి ఎన్నికలు మాత్రం చాలా కష్ట కాలాన్ని తీసుకువచ్చాయి. సాధారణ మెజారిటీకి కొద్ది దూరంలోనే ఆగిపోవడమే కాకుండా ప్రతిపక్ష పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఇండియా కూటమికి మంచి సీట్లే దక్కించుకుంది. ఇలాంటి పరిస్థితులలో కూడా లోక్సభ స్పీకర్ పదవి చాలా కీలకమని కూడా చెప్పవచ్చు.. బిజెపి సారథ్యంలో కీలకమైన పదవులు రావాలి అంటే.. RSS నేపథ్యంలోని ఒక పెద్ద అర్హత అని చెప్పవచ్చు.

అలాగే గవర్నర్ వంటి పథకాలు కేవలం సంఘీయులకే దక్కుతాయి.. అలాంటి క్లిష్టమైన పరిస్థితులలో లోక్సభ స్పీకర్ అంటే మరొక అవకాశం కూడా ఉండదు.. ఇటీవలే స్పీకర్ గా మరొకసారి ఓం బిర్లా కే అవకాశం లభించింది. అయితే ఈ పదవి ఎవరికి దక్కుతుందని గత కొద్ది రోజులపాటు సస్పెన్స్ కూడా కనిపించింది. ఒకానొక దశలో బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి కి ఈ అవకాశం లభిస్తుందని వార్తలు కూడా వినిపించాయి. ఈమె దివంగత నటుడు మాజీ సీఎం ఎన్టీఆర్ కుమార్తె.. టిడిపి పార్టీ ఉన్నప్పటికీ.. చంద్రబాబు నాయుడుతో విభేదాలు రీత్యా టిడిపి పార్టీకి దూరమై 2004 ఎన్నికలలో కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చింది.

2014 వరకు కేంద్రమంత్రిగా ఉన్న ఈమె విభజన అనంతర కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపిలోకి ఎంట్రీ ఇచ్చింది. బిజెపిలో మరింత ఉన్నత పదవులు దక్కించుకునేందుకు ఇదే అడ్డంకేగా మారిందనే విషయం వినిపిస్తోంది.. పురందేశ్వరికి  ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షురాలుగా పదవులు ఇచ్చిన పదేళ్ల నుంచి ప్రభుత్వంలో పదవులు మాత్రం దక్కించుకోలేకపోతోంది. ఇటీవల ఎన్నికలలో ఆమె రాజమహేంద్రవరం నుంచి ఎంపీగా గెలిచిన కేంద్ర క్యాబినెట్లో సరైన చోటు లభించలేదు.. డిప్యూటీ స్పీకర్ పదవిని బిజెపి మిత్ర ప్రక్షానికి సైతం కేటాయించే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం. మరి ఇలాంటి సమయంలో పురందేశ్వరి పార్టీ బాధ్యతలు లోని కొనసాగిస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: