కల్కి 2898 AD: 'రెబల్ స్టార్' కోసం 'పవర్ స్టార్' కొడుకు..!

FARMANULLA SHAIK
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ గురువారం (జూన్ 27) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైంది. రిలీజైన అన్ని చోట్లా ప్రభాస్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్, యాక్షన్ సీక్వెన్స్, ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ అదిరిపోయాయని రివ్యూలు వస్తున్నాయి. దీంతో ప్రభాస్ అభిమానుల తో పాటు పలువురు సినీ ప్రముఖులు కల్కి సినిమా ను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకిరా నందన్ కల్కి సినిమాను వీక్షించాడు. హైదరాబాద్ లోని ప్రసాద్ ఐ మ్యాక్స్ లో ఈ సినిమా ను చూశాడు అకీరా. ఈ సందర్భంగా అకీరా కల్కి టీ షర్ట్ ధరించి థియేటర్‌కు రావడం విశేషం. పవన్ తనయుడిని చూసిన అభిమానులు అతని తో కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమా ల్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన ప్రభాస్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు తెగ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.మహానటి ఫేం నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమా లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రామ్ గోపాల్ వర్మ, అన్నాబెన్, మాళవిక నాయర్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన తదితరులు ఈ సినిమా లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా ను నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: