ముక్కుపుడక.. మహిళ ప్రాణం మీదికి తెచ్చింది?

praveen
సోషల్ మీడియా అంతటా పాకిపోయింది. ప్రతి మనిషి ఇక ఇంటర్నెట్ అనే మాయలోనే మునిగితేలుతూ ఉన్నాడు. దీంతో ఇక ఎక్కడో జరిగిన ఘటనలు కూడా ఇంటర్నెట్లో వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ నుంచే అన్ని ఘటనలను కూడా తెలుసుకోగలుగుతున్నాడు మనిషి. కొన్ని కొన్ని సార్లు ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే  ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా మహిళలు తమ ముఖం మరింత అందంగా కనిపించేందుకు ముక్కుపుడక పెట్టుకుంటూ ఉంటారు.

 ముక్కుపుడికే మహిళ ముఖానికి అందం అని ఎంతో మంది చెబుతూ ఉంటారు. ఇక ముక్కుపుక్క పుడుక పెట్టుకునే అమ్మాయిలను అబ్బాయిలు తెగ ఇష్టపడతారని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తమకు నచ్చిన స్టైల్లో అమ్మాయిలు ముక్కుపుడక పెట్టుకోవడం చూస్తూ ఉంటాం. ఇక కొంతమంది ఇలా ముక్కుపుడక పెట్టుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. అయితే ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన గురించి తెలిస్తే మాత్రం ఇంకోసారి ముక్కుపుడక పెట్టుకోవాలి అంటే భయపడిపోతారేమో.. ఎందుకంటే ఇక్కడ ఒక యువతికి ముక్కుపుడక చివరికి ప్రాణాల మీదికి తీసుకువచ్చింది.

 ముక్కుపుడక ప్రాణాల మీదికి తీసుకురావడం ఏంటీ.. ఇదేదో వినడానికి విచిత్రంగా ఉంది అనుకుంటున్నారు కదా. పశ్చిమ బెంగాల్లో ఇలాంటి ఘటన నిజంగానే జరిగింది. వర్షా అనే 35 ఏళ్ల మహిళ ఊపిరితిత్తుల నుంచి డాక్టర్లు ముక్కుపుడక పిన్నును బయటకు తీశారు. ఆమె 17 ఏళ్ల నుంచి ఆ ముక్కు పుడక పెట్టుకుని ఉన్నారు. ఈ క్రమంలోనే పొరపాటున అది ముక్కు ద్వారా లోపలికి వెళ్ళిపోయింది. అయితే ఏడు నెలలుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో.. ఆసుపత్రికి వెళ్లారు. అయితే పరీక్షించిన వైద్యులు రిపోర్టులు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమె ఊపిరితిత్తుల్లో ఏకంగా ముక్కుపుడక పిన్ను ఉన్నట్లు గుర్తించారు. ఇక ఎంతో కష్టం మీద ఆపరేషన్ చేసి ఆ ముక్కుపుడక పిన్నును బయటకు తీయడంతో ఆ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: