పుష్ప లో కేశవ రోల్ కోసం మొదట అతన్ని అనుకున్నాం... సుకుమార్..!

MADDIBOINA AJAY KUMAR
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఇండియా వైడ్ గా క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అందాల ముద్దు గుమ్మ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు . ఇక పోతే మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడం తో రెండవ భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ మూవీ రెండవ భాగాన్ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు . ఇక పోతే "పుష్ప పార్ట్ 1" మూవీ లో అల్లు అర్జున్ కు స్నేహితుడి పాత్రలో జగదీష్ ప్రతాప్ బండారి నటించిన విషయం మనకు తెలిసిందే . ఈయన ఈ మూవీ లో కేశవ అనే పాత్రలో నటించాడు. ఇకపోతే ఈయనకు ఈ ఒక్క సినిమాతోనే ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇక పుష్ప మూవీ విడుదల తర్వాత నుండి ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో అవకాశాలు దక్కాయి.

దానితో ప్రస్తుతం ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే తాజాగా సుకుమార్ , సుహస్ హీరో గా నటించిన ప్రసన్న వదనం సినిమా ట్రైలర్ విడుదల వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇక ఈ ట్రైలర్ విడుదల వేడుకలో భాగంగా సుకుమార్ మాట్లాడుతూ ... పుష్ప మూవీ లో కేశవ పాత్ర కోసం మొదట సుహస్ నే అనుకున్నాం. కాకపోతే ఆయన అప్పటికే హీరోగా సినిమాలు చేస్తూ ఉండడంతో అతని పెడితే బాగోదేమో అనుకొని అతన్ని తీసుకోలేదు అని సుకుమార్ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: