“ఐపీఎల్ చరిత్ర” లో అరుదైన “రికార్డ్”

Bhavannarayana Nch

ఐపీఎల్ 11 సీజన్ లో భాగంగా జరిగిన అన్ని మ్యాచ్ లు ఎంతో ఉత్ఖంటబరితంగానే సాగాయి... అయితే చివరి మ్యాచ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ మరియు హైదరాబాదు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సన్రైజర్స్ కెప్టెన్ విలియమన్స్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు...ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్‌లో ఏడొందలకు పైగా పరుగులు సాధించిన ఐదవ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు..

 

అయితే పైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ (47) మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు...ఈ సీజన్ లో చివరి మ్యాచ్ లో సాధించిన 47 పరుగులకి గాను మొత్తం 735 పరుగులు నమోదు చేశాడు.అంతేకాదు ఐపీఎల్ 11వ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్‌ని కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు...

 

కోహ్లి  2016 ఐపీఎల్ సీజన్ తో 976 పరుగులు చేశాడు. ఆ తర్వాతి స్థానంలో డేవిడ్ వార్నర్ అదే ఏడాది 848 పరుగులు చేసి సన్ రైజర్స్‌ని టైటిల్ విజేతగా నిలిపాడు...అయితే విలియమన్స్ ఈ ఘనత సాధించిన వారిలో మూడవ స్థానంలో ఉన్నాడు..”క్రిస్ గేల్” 733 పరుగుల  2013, మరియు  “మైక్ హస్సీ” 733 పరుగులు, 2013, క్రిస్ గేల్ 708 పరుగులు, 2013 ఉన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: