ఏపీ: కేసీఆర్‌పై కారాలు, మిరియాలు నూరుతున్న టీడీపీ తమ్ముళ్లు.. అసలు ఏమైంది?
లోక్ సభ ఎలక్షన్లలో తెరాస నేతలను ఎలాగైనా తుక్కుతుక్కుగా ఓడించాలని వీరు కసితో రగిలిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ కూడా అందిస్తున్నారు. తెరాస బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా గెలిచి మోదీని గద్దె దించాలని కేసీఆర్ చాలానే ప్రయత్నించారు. ఇప్పుడు టీడీపీ బీజేపీతో కలిసి ఏపీ ఎలక్షన్లలో పోటీ చేస్తోంది. బీజేపీకి కూడా బీఆర్ఎస్ వ్యతిరేకమే కాబట్టి ఈ రెండు పార్టీలు కలిసి ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ లను ఓడించాలంటూ ప్రచారాలు చేస్తున్నాయి.
ఇకపోతే తెలంగాణలో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికలలోనైనా ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని తాపత్రయ పడుతోంది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పట్ల చాలానే వ్యతిరేకత పెరిగిపోతోంది. గ్యాస్ సిలిండర్ల పై సబ్సిడీ ఇస్తామని కాంగ్రెస్ ఇప్పటిదాకా దానిని సరిగా అమలు చేయడం లేదు. బస్సు ఫ్రీ అన్నారు కానీ ఆడవాళ్లు పనులు మానేసి బస్సుల్లో తిరగలేరు కదా. ఒక కరెంటు పై మాత్రమే సబ్సిడీ లభిస్తుంది. కొత్త పింఛన్లు ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు.
కల్యాణ లక్ష్మి వంటి పథకాల కింద తులం బంగారం ఇస్తారని చెప్పారు. అది కూడా నెరవేర్చలేదని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలు చేసే ప్రభుత్వమని, అధికారంలోకి రావడానికి మాత్రమే హామీలు ఇస్తారు కానీ నిజంగా నెరవేర్చలేరు అని అప్పుడే తెలంగాణ ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో చూసుకుంటే మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావచ్చు. టీడీపీ తమ్ముళ్లకు షాక్ ఇవ్వచ్చు.