కోహ్లీ క్రేజే క్రేజూ.. జెర్సీ ఎంతకు అమ్ముడు పోయిందో తెలుసా?

praveen

తాజాగా టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ కె.ఎల్. రాహుల్, ఆయన భార్య, నటి అతియ శెట్టి కలిసి ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. వీళ్లు పేద పిల్లలకు మెరుగైన చదువు అందించాలనే ఉద్దేశంతో విప్లవ ఫౌండేషన్‌కు సహాయం చేయడానికి ‘క్రికెట్ ఫర్ చారిటీ’ అనే ఆక్షన్ నిర్వహించారు. ఈ ఆక్షన్ గురువారం ముంబైలో జరిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పెద్ద పేర్లున్న క్రికెటర్లు తమ విలువైన వస్తువులను లేదా ప్రైజ్ మెమోరాబిలియాను ఈ మంచి కార్యక్రమం కోసం ఇచ్చారు. ఈ ఆక్షన్‌లో విరాట్ కోహ్లీ జెర్సీ రూ.40 లక్షలకు అమ్ముడు పోయింది.
ఈ జెర్సీ కేవలం క్రికెట్ మైదానంలోనే కాదు బయట చాలామంది పిల్లలకు చదువు అందించడంలోనూ ఉపయోగపడుతుందని దీంతో నిరూపితం అయ్యింది. ఈ వేలం చాలా విజయవంతంగా సాగింది. దీని ద్వారా మొత్తం 1.93 కోట్ల రూపాయలు సేకరించారు. స్పోర్ట్స్ పర్సన్స్ సామాజిక సేవ చేయడంలో కూడా ముందుంటారు. మరి కూడా సమాజానికి చాలా మంచి చేయగలరు అని ఈ ఆక్షన్ చెప్పకనే చెబుతోంది. విరాట్ కోహ్లీ జెర్సీనే కాదు. ఆయన హ్యాండ్ గ్లౌజ్స్‌ కూడా 28 లక్షల రూపాయలకు అమ్ముడయ్యాయి. రోహిత్ శర్మ బ్యాట్ కూడా 24 లక్షల రూపాయలకు పోయింది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ, తన బ్యాట్‌ను ఈ వేలంలో పెట్టడం ద్వారా తన చరిత్రకు మరో అధ్యాయాన్ని జోడించారు. ఆ బ్యాట్ 13 లక్షల రూపాయలకు అమ్ముడైంది. రాహుల్ ద్రవిడ్ బ్యాట్ కూడా 11 లక్షల రూపాయలకు అమ్ముడైనది. ఇది క్రికెట్ దిగ్గజాలు తమ అభిమానులతో ఎంతగా అనుబంధం కలిగి ఉన్నారో తెలియజేస్తుంది. కె.ఎల్. రాహుల్ జెర్సీ కూడా 11 లక్షల రూపాయలకు అమ్ముడైంది.
"రాహుల్, నేను విప్లవ ఫౌండేషన్‌కు సహాయం చేయడానికి 'క్రికెట్ ఫర్ ఎ కాజ్' అనే మొదటి చారిటీ ఆక్షన్ నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాము" అని అతియ శెట్టి ఈ కార్యక్రమంలో తెలిపారు. "ఈ ఆక్షన్ ద్వారా వచ్చే డబ్బు మొత్తం విప్లవ ఫౌండేషన్‌లోని చెవిటి, మానసికంగా అభివృద్ధి చెందని పిల్లల ప్రత్యేక పాఠశాలకు వెళుతుంది. ఈ కారణం నాకు చాలా ప్రత్యేకమైనది" అని రాహుల్ అతియ మాటలకు అంగీకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: