అఫీషియల్ : ఆ తేదీన జపాన్ లో జవాన్ రిలీజ్..!

Pulgam Srinivas
హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ కొంత కాలం క్రితం జవాన్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో షారుక్ ఖాన్ డ్యూయల్ రోల్ లో నటించాడు. ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకు గానూ నటించాడు. ఇకపోతే ఈ సినిమాలో దీపికా పదుకొనే , నయనతార హీరోయిన్లుగా నటించారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
 

ఇకపోతే భారీ అంచనాల నడుమ పోయిన సంవత్సరం సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకొని ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయ్యి 1000 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమాను మరికొన్ని రోజుల్లోనే జపాన్ లో విడుదల చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను జపాన్ లో ఈ సంవత్సరం నవంబర్ 29 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాలో తమిళ నటుడి విజయ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు. మరి ఇప్పటికే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని భారీ కలక్షన్లను వసూలు చేసిన ఈ సినిమా జపాన్ ఆడియన్స్ ను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో , అక్కడ ఏ రేంజ్ కలెక్షన్లను వస్తువులు చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: