టీవీ: బిగ్ బాస్ వల్ల గంగవ్వ తలరాత మారిపోయిందా.. సంపాదన ఎన్ని కొట్లంటే..?

frame టీవీ: బిగ్ బాస్ వల్ల గంగవ్వ తలరాత మారిపోయిందా.. సంపాదన ఎన్ని కొట్లంటే..?

Divya
బిగ్బాస్ ద్వార చాలామంది తమకు కలిసి రాలేదని చెప్పిన సెలబ్రిటీగా చాలామంది ఉన్నారు. కానీ బిగ్ బాస్ వల్లే తమ జీవితం మారిపోయిందని ఇప్పుడు తాజాగా చెప్పుకొస్తోంది గంగవ్వ.. సోషల్ మీడియాలో తనదైన యాసతో మాట్లాడుతూ అందరిని ఆకట్టుకున్న గంగవ్వ.. బిగ్బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత మరింత ఫేమస్ అయ్యి పలు చిత్రాలలో కూడా అవకాశాలను అందుకుంది. యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు చేసుకుంటూ హాయిగా తన జీవితాన్ని సైతం ఇప్పుడు గడిపేస్తోంది. బిగ్ బాస్ -4 లో పాల్గొనింది.

బిగ్బాస్ వల్లే గంగవ్వ  జీవితం మారిపోయిందని ఇటీవలె తెలియజేస్తోంది. తన ఆస్తులు కూడా చాలా పెరిగిపోయాయని తన ఇల్లును కూడా చూపిస్తూ మైవిలేజ్ షో టీమ్ అనే ఒక వీడియో ద్వార తెలియజేస్తోంది .తన ఇంటికి రూ .22 లక్షల రూపాయలు ఖర్చు అయ్యిందని అలాగే ఆవుల కోసం రేకుల షెడ్డు కోసం, గడ్డి కూడ పెంచుతున్నానంటూ తెలియజేస్తోంది గంగవ్వ.. ఇలా అన్నిటి కోసమే సుమారుగా3 లక్షలు ఖర్చు అయిందని తెలిపింది.

ఆ తర్వాత ఒకచోట 9 లక్షల రూపాయలు విలువైన స్థలం ఉన్నదని మరొకచోట రెండున్నర ఎకరాల పొలం కూడా ఉన్నదని.. దీని విలువ రూ .75 లక్షలకు పైగా ఉంటుందని తెలుపుతోంది. అలాగే మరొక చోట ఒక ఫ్లాట్ కూడా చూపిస్తూ దీనిని సుమారుగా 3 లక్షల రూపాయలకు కొన్నాను అంటూ తెలియజేస్తోంది. అలాగే మరికొన్నిచోట్ల 30 సెంట్ల భూమి ఉందని దీని విలువ 7 లక్షలకు పైగా ఉందని తెలిపింది. ఇలా తన ఇల్లు వ్యవసాయ భూమి కమర్షియల్ ప్లాట్లు అన్నీ కూడా సుమారుగా కోటి 24 లక్షల వరకు విలువ అవుతోందని తెలియజేస్తోంది గంగవ్వ. వీటితోపాటు 5 తులాల బంగారు కూడా ఉందని.. తన మనవరాలు పెళ్ళికి కూతుర్ల ఇచ్చిన మొత్తం 5 లక్షలు ఖర్చు అయిందని తెలుపుతోంది గంగవ్వ. ఇదంతా కూడా బిగ్ బాస్ వల్లే సాధించారని తన జీవితంలో ఎప్పటికైనా  50 ఆవులు పెంచి పాలు అమ్ముకొని బతకాలని కోరిక ఉందని తెలిపింది గంగవ్వ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: