ఎన్టీఆర్, వైఎస్సార్ లకు ధీటుగా రేవంత్ రెడ్డి పాలన.. వాళ్లకు అండగా నిలిచారుగా!

frame ఎన్టీఆర్, వైఎస్సార్ లకు ధీటుగా రేవంత్ రెడ్డి పాలన.. వాళ్లకు అండగా నిలిచారుగా!

Reddy P Rajasekhar
ఏ రాష్ట్రంలో అయినా ప్రజలకు మంచి చేయాలని భావించే నేతలకు అధికారం అవసరం. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలు ఉన్నా అధికారం లేకపోతే ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతికి తావు లేకుండా అద్భుతంగా పాలన సాగించిన నేతలెవరనే ప్రశ్నకు సీనియర్ ఎన్టీఆర్, వైఎస్సార్ పేర్లు సమాధానంగా వినిపిస్తాయి. ఈ ఇద్దరు నేతలు ఎన్నో మంచి పథకాలను అమలు చేశారు.
 
అయితే ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎన్టీఆర్, వైఎస్సార్ లకు ధీటుగా పాలన సాగిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని వీలైనంత వేగంగా అమలు చేస్తూ ప్రజల ప్రశంసలు అందుకున్నారు. పేదలకు అండగా నిలిచే విషయంలో రేవంత్ రెడ్డికి ఎవరూ సాటిరారని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి పాలనలో సైతం తనదైన ముద్ర వేశారనే చెప్పాలి.
 
రేవంత్ రెడ్డి ఒక్కో మెట్టు ఎదిగి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ప్రజల మనస్సులను గెలుచుకుని సీఎం అయ్యారు. హైడ్రా విషయంలో ప్రజల్లో ఒకింత భిన్నాభిప్రాయాలున్నా రేవంత్ నిర్ణయాలు సరైనవే అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో పొలిటికల్ గా మరింత ఎదిగి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
2028 ఎన్నికల్లో సైతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రేవంత్ రెడ్డి అందరు నేతలను కలుపుకొంటూ ముందడుగులు వేస్తున్నారు. రేవంత్ రెడ్డి పేద ప్రజలకు, రైతులకు మేలు జరిగేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గ్రేట్ సీఎం అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని స్పూర్తిగా తీసుకుని ఇతర రాష్ట్రాలు సైతం కొన్ని పథకాలను అమలు చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి లాంటి సీఎం ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టం అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: