అలా చేయడం కరెక్ట్ కాదు.. అనసూయ సంచలన పోస్ట్ నెట్టింట వైరల్!

Reddy P Rajasekhar

టాలీవుడ్ పాపులర్ యాంకర్లలో ఒకరైన అనసూయ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.  కొంతమంది పురుషులు.. ఇంకా కొంతమంది మహిళలు కూడా.. నా వయసును ఉపయోగించి నన్ను తక్కువగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు.   ఈ విధమైన ఆలోచన కలిగిన వారు ఎక్కువగా గుర్తింపు ఉన్న మహిళలను టార్గెట్ చేస్తారని అనసూయ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇది మహిళలపై నియంత్రణ కోల్పోతామన్న భయం వల్ల.. అలాగే బలహీనమైన పితృస్వామ్య అహంకారాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో జరుగుతుందని అనసూయ అభిప్రాయపడ్డారు.  ఈ పోస్ట్ అందరు పురుషుల గురించీ లేదా అందరు మహిళల గురించీ కాదని  కానీ నేను పురుషులు.. మహిళలు.. అందరికీ విన్నపం చేస్తున్నానని బ్రాడ్ మైండ్ తో ఆలోచించాలని  పాత తరాలు నేర్చుకున్నవి లేదా అలవాటుపడ్డ ఆలోచనలు మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు.

 మనం మార్పును ఎంచుకోవచ్చు.. మన గౌరవాన్ని.. మన స్వేచ్ఛను కాపాడుకోవచ్చు.. ఒకరికొకరం పవర్ అవ్వాలి సపోర్ట్ గా నిలవాలి  మన విలువ మన  సెలక్షన్ నుంచి వస్తుంది తప్ప మరే దానితో కాదని అనసూయ అన్నారు.  మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని  మీ పని బాధ్యతతో చేయాలి.. ఈ విధమైన గ్లోరిఫికేషన్ కరెక్ట్ కాదని  ఆమె కామెంట్లు చేశారు.  అయితే అనసూయ పోస్ట్ కు ఎక్కువగా  నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి. అనసూయ చేసిన ప్రతి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: