ఏపీ: ఆ టిడిపి కేంద్రమంత్రికి అరుదైన గౌరవం..!

Divya
టిడిపి కూటమిలో భాగంగా శ్రీకాకుళం ఎంపీగా రామ్మో నాయుడు గెలిచారు. దీంతో ఈయనకు కేంద్ర మంత్రిగా పౌర విమాన శాఖ మంత్రి కూడ అందుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈయనకు ఒక అరుదైన గౌరవం లభించినట్లుగా తెలుస్తోంది. అదేమిటంటే ఆసియాలోనే పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా రామ్మోహన్ నాయుడు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ మంత్రుల సదస్సుల రామ్మోహన్ నాయుడుని ఏకగ్రీవంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రామ్మోహన్ నాయుడు పేరును సింగపూర్ ప్రతి పాధించగా బూటాన్ సమర్ధించినదట.

అలా ఈ రెండు దేశాలతో పాటు మిగతా దేశాలు కూడ రామ్మోహన్ నాయుడు పేరుని తెలపడంతో ఏకగ్రీవంగా గెలిచారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌర విమాన రంగాన్ని సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తాను అంటూ హామీ ఇచ్చారు.. అలాగే ఆసియా, పసిఫిక్ సభ్య దేశాల మధ్య ఈ రాకపోకలను సులభంగా చేసేందుకు కృషి చేస్తానంటూ తెలియజేశారు. దేశం తరఫున దక్కిన ఈ గౌరవాన్ని తాను బాధ్యతగా స్వీకరించి నిర్వహిస్తానని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

అలాగే ఆసియా ,పసిఫిక్ వంటి పౌర విమాన అభివృద్ధి విషయం పైన రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వాణిజ్య విమానం పదేళ్ల క్రితమే మొదలయ్యిందని తెలిపారు.. ఆసియా పసిఫిక్ ప్రాంతం 2035 నాటికి అది పెద్ద విమాన మార్కెట్ గా నిలుస్తుందని తెలియజేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోనే ఇండియాలోనే ఏవియేషన్ చాల శరవేగంగా  ముందుకు వెళ్తోంది.. 2040 నాటికి దేశంలోనే విమానాశ్రయాలు ఉండే సంఖ్య పెరుగుతుందని కచ్చితంగా తెలియజేశారు. సుమారుగా 350 విమానాశ్రయాలు పెంచాలని ఆలోచన తో ఉన్నట్లుగా తెలియజేశారు. 2014లో 74 ఉండే  ఎయిర్ పోస్టులు 157 కి పెంచామంటూ తెలియజేశారు.. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని చోట్ల ఎయిర్ పోర్టులను  విస్తరించేలా ప్లాన్ చేస్తున్నామంటూ రామ్మోహన్ నాయుడు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: