బిగ్బాస్ 8 లాంచింగ్ ఎపిసోడ్కి కళ్ళు చెదిరే టిఆర్పి.. ఎంతో తెలుసా..?

frame బిగ్బాస్ 8 లాంచింగ్ ఎపిసోడ్కి కళ్ళు చెదిరే టిఆర్పి.. ఎంతో తెలుసా..?

Pulgam Srinivas
తెలుగులో అత్యంత ప్రజాధరణ పొందిన రియాలిటీ గేమ్ షో లలో బిగ్ బాస్ ఒకటి. ఇకపోతే ఈ రియారిటీ షో మొదట ఇండియాలో హిందీ లో ప్రారంభం అయింది. ఈ రియాలిటీ గేమ్ షో కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తూ ఉండడంతో ఈ షో ను ఆ తర్వాత ఇండియాలోని అనేక ప్రాంతీయ భాషలలో కూడా మొదలు పెట్టారు. అందులో భాగంగా తెలుగులో కూడా బిగ్ బాస్ మొదలు అయ్యి చాలా కాలమే అవుతుంది. ఇప్పటి వరకు తెలుగు లో బిగ్ బాస్ 7 సీజన్లు విజయవంతంగా బుల్లి తెరపై కంప్లీట్ కాగా , ఒక ఓ టి టి సీజన్ కంప్లీట్ అయింది. ఇకపోతే ప్రస్తుతం తెలుగు బుల్లి తెర సీజన్ 8 కొనసాగుతుంది.

బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1 వ తేదీన పెద్ద ఎత్తున ప్రారంభం అయింది. ఇకపోతే బిగ్ బాస్ 8 వ సీజన్ కి టాలీవుడ్ కి అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ తెలుగు ప్రతి సీజన్ ప్రారంభ ఎపిసోడ్ కు అదిరిపోయే రేంజ్ లో టి ఆర్ పి రేటింగ్ వస్తూ ఉంటుంది. దానితో బిగ్ బాస్ బృందం వారు కూడా ప్రారంభ ఎపిసోడ్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తూ ఉంటారు. ఈ సారి బిగ్ బాస్ ప్రారంభ ఎపిసోడ్ కి కూడా అదిరిపోయే రేంజ్ లో టి ఆర్ పి రేటింగ్ దక్కింది. ఈ సారి బిగ్ బాస్ ప్రారంభ ఎపిసోడ్ కి ఏకంగా 18.9 టి ఆర్ పి రేటింగ్ దక్కినట్లు తెలుస్తోంది. ఇలా అదిరిపోయే టి ఆర్ పి రేటింగ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభ ఎపిసోడ్ కు వచ్చినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: