రేవంత్ రెడ్డి 9 నెలల పాలన : గృహ జ్యోతి పథకానికి ప్రజల నుండి సూపర్ రెస్పాన్స్..?

Pulgam Srinivas
తెలంగాణ రాష్ట్రంలో పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి నీ కాంగ్రెస్ అధిష్టానం పిసిసి చీఫ్ గా నియమించింది. ఆ తర్వాత ఈయన అద్భుతమైన ప్రణాళికలతో పార్టీని ముందుకు తీసుకువెళ్లాడు. ఇక ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీపై నమ్మకం భారీగా పెరిగింది. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి అనేక హామీలను ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి అధికారంలోకి వచ్చాక అర్హులైన వారందరికీ గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు ని ఇవ్వనున్నట్లు ప్రకటించాడు.

ఇక చాలా మంది నేతలు 200 యూనిట్ల వరకు కరెంట్ ను ఫ్రీ గా ఇవ్వడం అనేది జరగని పని. ఎలక్షన్ల ముందు ఇలానే చెబుతారు. ఆ తర్వాత మాట దాటవేస్తారు అని అన్న సందర్భాలు ఉన్నాయి. ఇక ఎలక్షన్ల తర్వాత కూడా ఫ్రీ కరెంట్ పథకాన్ని ప్రారంభించడానికి కొంత సమయం పట్టింది. ఆ సమయం లోపు కూడా అనేక మంది నేతలు ఎప్పటి నుండి గృహ జ్యోతి పథకాన్ని ప్రజలకు అమల్లోకి తీసుకు వస్తారు. చెప్పి చాలా రోజులు అయింది. ఇంకా అమలు కావడం లేదు. అనే మాటలను కూడా చేశారు. కానీ రేవంత్ రెడ్డి కాస్త సమయం తీసుకున్న కానీ గృహ జ్యోతి పథకాన్ని అమలు చేయడంలో సక్సెస్ అయ్యాడు.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని అనేక కుటుంబాలకు 200 యూనిట్ల లోపు కరెంట్ బిల్లు వస్తే దానిని గృహ జ్యోతి సబ్సిడీ పథకం కింద బిల్లు లేకుండా చేస్తున్నారు. ఇక ఈ పథకానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. ఈ తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చాక చేస్తాము అన్న కొన్ని పథకాలను అమలు చేశారు. అందులో సూపర్ సక్సెస్ అయిన పథకాలలో గృహ జ్యోతి సబ్సిడీ పథకం ఒకటి. ఈ పథకం ద్వారా ప్రస్తుతం అనేక మంది తెలంగాణ కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: