బ్రేకింగ్: తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్.!

frame బ్రేకింగ్: తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్.!

FARMANULLA SHAIK
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి చీర, గాజులు పంపిస్తున్నానని చేసిన వ్యాఖ్యలతో మొదలైన రగడ చిలికి చిలికి గాలివానగా మారింది. బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య చోటుచేసుకున్న సవాళ్ల పర్వం ఉద్రిక్తతకు కారణమైంది. పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి అనుచరులను వెంటబెట్టుకొని వెళ్లిన అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ధర్నా చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.కౌశిక్ రెడ్డి ఇంటి పైన కోడిగుడ్లు, టమాటాలతో కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం, అరికపూడి గాంధీ అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతినివ్వాలని పోలీసులతో వాగ్వాదానికి దిగడం వంటి ఘటనలతో అరికెపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన పైన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో న్యాయం కోసం వేలాదిగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తరలి రావాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. సీపీ కార్యాలయంలో మూడు గంటలుగా హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతల నిరసన కొనసాగుతోంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ, అనుచరులను అరెస్టులు చేయాలని.. దాడికి ప్రోత్సహించిన సీఐ, ఏసీపీని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని వారు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ గా చేసుకుని వారిపై దాడులు చేస్తున్నారు. ఈ విధానం సరికాదు. ఇది అత్యంత హేయమైన చర్య. ఈ విధానాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పి తీరాలి. ఇటు దాడిని నిలువరించడంలో విఫలమైన పోలీస్ అధికారులపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి’ అంటూ హరీశ్ రావు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో హైదరాబాదులోని సైబరాబాద్ సిపీ ఆఫీస్ వద్ద నిరసనకు దిగిన మాజీ మంత్రి హరీష్ రావు సహా పలువురు బిఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ సిపి ఆఫీస్ వద్ద బి ఆర్ ఎస్ నేతలు బైఠాయించారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరిన వెనక్కి తగ్గలేదు. దీంతో ఇప్పటివరకు వేచి చూసిన పోలీసులు నేతలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి పిఎస్ కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: