సినిమా ఇండస్ట్రీలో ఏదైనా హీరోకు , హీరోయిన్ కి , దర్శకుడికి లేక నిర్మాతకి ఎవరికైనా క్రేజ్ ఉన్నది అంటే ఆ క్రేజ్ ను వాడుకొని తమ సినిమాలను జనాల్లోకి తీసుకువెళ్లడానికి కొంత మంది రెడీగా ఉంటారు. అందుకు ఉదాహరణగా చెప్పాలి అంటే ఒక హీరో పెద్ద క్రేజీ లేని సమయంలో ఒక సినిమాలో నటించినట్లు అయితే , ఆ సినిమా విడుదల అయిన పెద్దగా జనాలు పట్టించుకోరు. ఇక ఆ తర్వాత అతనికి భారీ స్థాయిలో క్రేజ్ వచ్చినట్లు అయితే తాను పూర్వం నటించిన సినిమాలను ఇతర భాషలలో విడుదల చేస్తూ ఉంటారు. వాటి ద్వారా ఆ హీరోనీ ఉపయోగించుకొని కొంత మొత్తం లో డబ్బు సంపాదించుకోవచ్చు అని కొంత మంది ప్లాన్ వేస్తూ ఉంటారు.
ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. మహేష్ ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించాడు. కానీ ఎప్పుడూ కూడా మహేష్ తెలుగులో తప్పితే ఇతర భాష సినిమాల్లో నటించలేదు. మహేష్ తన తదుపరి మూవీ ని ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషలలో విడుదల చేయనున్నారు. ఇక మహేష్ రాజమౌళి తో సినిమా చేయబోతున్నాడు అని తెలియగానే మహేష్ కు సంబంధించిన వార్తలు ప్రపంచం మొత్తం చెక్కర్లు కొడుతున్నాయి.
దానితో మహేష్ గతంలో నటించిన కొన్ని సినిమాలను హిందీ లో , ఇతర భాషలలో విడుదల చేయాలని కొంత మంది భావిస్తున్నట్లు తెలుస్తోంది. దానితో మహేష్ అలాంటి వారందరికీ కూడా రాజమౌళి తో నటించిన సినిమా విడుదల అయ్యేంతవరకు తన సినిమాలు ఏవి డబ్బింగ్ చేసి విడుదల చేయకూడదు అని కొంత మంది నిర్మాతలకు సూచించినట్లు తెలుస్తోంది.