గౌతమ్ గంభీర్ కండిషన్లలో.. రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ కూడా ఉందట తెలుసా?

praveen
టీమిడియాకు ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు హెడ్ కోచ్గా కొనసాగుతున్న రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసింది. అయితే ఇలా తన పదవీకాలం ఎప్పుడో ముగిసినప్పటికీ బీసీసీఐ పెద్దల స్పెషల్ రిక్వెస్ట్ తో కొన్నాళ్లపాటు ఆయన ఇక భారత జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరించినందుకు అంగీకరించాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రావిడ్ తప్పుకోబోతుండడంతో.. ఇక కొత్త కోచ్ ను వెతుక్కోవాల్సిన పరిస్థితి అటు బీసీసీఐకే ఏర్పడింది. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న అటు కొత్త కోచ్ కావాలంటు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

 దరఖాస్తుల కోసం ఒక డెడ్ లైన్ కూడా విధించింది. అయితే ఈ ప్రకటన వచ్చిన నాటి నుంచి కూడా ఎవరెవరు కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు అన్న విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. కాగా టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్  ను భారత సెలక్టర్లు హెడ్ కోచ్ గా నియమించేందుకు మొగ్గు చూపుతున్నారని ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే దాదాపుగా గంభీర్ భారత హెడ్ కోచ్ గా ఖరారు అయిపోయాడు అంటూ ఇంకొన్ని వార్తలు తెరమీదకి వచ్చాయి.  మొన్నటికి మొన్న  గంభీర్ ని ఇంటర్వ్యూ చేశారంటూ ఒక టాక్ బయటకు వచ్చింది.

 ఇకపోతే హెడ్ కోచ్ గా వచ్చేందుకు గౌతమ్ గంభీర్ ఏకంగా బీసీసీఐ పెద్దల ముందే కొన్ని కండిషన్లు పెట్టాడట. అవి క్రికెట్ వ్యవహారాల్లో ఎవరి జోక్యాలు, ఒత్తిళ్లు  ఉండరాదు అని ముందే చెప్పాడట. సహాయక సిబ్బంది ఎంపికలో ఇంకెవరి పాత్ర ఉండొద్దు అనే కండిషన్ పెట్టాడట. వచ్చే ఏడాది  ఛాంపియన్స్ ట్రోఫీ గెలవకపోతే జట్టులో నుంచి రోహిత్ కోహ్లీ లాంటి సీనియర్ లను పక్కన పెట్టాలి అనే కండిషన్ను కూడా పెట్టాడట గౌతమ్ గంభీర్. టెస్టుల కోసం ప్రత్యేకమైన జట్టును రెడీ చేయాలని.. అలాగే 2027 వరల్డ్ కప్ కోసం కూడా ఇప్పటినుంచి పక్క ప్రణాళికలతో ముందుకు సాగాలని కండిషన్లు పెట్టాడట గౌతమ్ గంభీర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: