కెప్టెన్ గా.. ధోనికి సాధ్యం కానీ రికార్డు సృష్టించిన రోహిత్?

praveen
ప్రస్తుతం టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కూడా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ.. తన ఆట తీరుతో అదరగొట్టేస్తున్నాడు. వ్యక్తిగత ప్రదర్శనలో ఆకట్టుకోవడమే కాదు కెప్టెన్ గా కూడా జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. మరీ ముఖ్యంగా వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నమెంట్లలో రోహిత్ శర్మ తన కెప్టెన్సీ తో మ్యాజిక్ చేసి చూపిస్తున్నాడు అని చెప్పాలి. కాగా ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఇక భారత జట్టును అన్ని మ్యాచ్లలో కూడా విజయం సాధించి జైత్రయాత్ర కొనసాగించేలా చేశాడు. కానీ ఫైనల్లో మాత్రం టీమిండియా ఓడిపోయింది.

 ఇక ఎప్పుడు వెస్టిండీస్, యుఎస్ వేదికగా జరుగుతున్న 2024 t20 వరల్డ్ కప్ లో కూడా భారత జట్టు భారీ అంచనాల మధ్య బలులోకి దిగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకుంటుంది. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా విజయం సాధిస్తూ ఇప్పుడు కూడా జైత్రయాత్రను కొనసాగిస్తుంది టీమిండియా. అయితే ఇటీవల సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టును ఓడించి నేరుగా ఫైనల్ లోకి అడుగుపెట్టింది భారత జట్టు. ఇక రేపు ఫైనల్లో సౌత్ ఆఫ్రికా తో తలబడబోతుంది అన్న విషయం తెలిసిందే. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఎన్నో అరుదైన రికార్డులు సృష్టిస్తున్నాడు.

 కాగా ఇక టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు ఫైనల్ అడుగు పెట్టడం వల్ల రోహిత్ శర్మ ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. మూడు ఫార్మాట్లలో జట్టును ఐసీసీ ఫైనల్స్ లోకి తీసుకువెళ్లిన రెండో కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 వన్డే వరల్డ్ కప్ 2024 t20 వరల్డ్ కప్ లో భారత జట్టును ఫైనల్ లో చేర్చాడు రోహిత్ శర్మ. అయితే డబ్ల్యూటీసి ఫైనల్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీం ఇండియా ఓడిపోయినప్పటికీ ఇప్పుడు టి20 వరల్డ్ కప్ ఫైనల్లో గెలవాలని భారత జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. కాగా గతంలో న్యూజిలాండ్ కెప్టెన్ గా కేన్ విలియమ్సన్  మాత్రమే ఇలా జట్టును మూడు ఫార్మాట్ లలో ఫైనల్ కు తీసుకువెళ్లిన కెప్టెన్గా రికార్డు సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: