కల్కి 2898AD: కల్కీ సినిమాతో భారీగా మోసపోయిన హీరోయిన్‌ ?

Veldandi Saikiran
యంగ్ రెబల్ స్టార్ తాజాగా నటించిన చిత్రం కల్కి 2898 ఏడి. ఈ సినిమా జూన్ 27వ తేదీన రిలీజ్ అయి పెద్ద సంచలనమే సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అన్ని థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్గా దీపికా పదుకొనే నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్టార్ నటీనటులు కీలకపాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాలో మహాభారతం, కల్కి అవతారం లాంటి భారతీయ పురాణాలకు సంబంధించినవి గ్రాఫిక్స్, యాక్షన్ వంటి సన్నివేశాలను చాలా అద్భుతంగా నాగ్ అశ్విన్ రూపొందించారు.

ఈ సినిమాకు దాదాపు 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సుమంత్ అశ్విన్ నిర్మించారు. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 400 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ సినిమాలో స్టార్ నటినటులు ఎందరో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇందులో భాగంగానే ఈ సినిమాలో దిశా పటాని కూడా ఓ కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో రాక్సీ పాత్ర చేసిన ఈ బ్యూటీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది.

దిశా పాత్ర ఉన్నా లేకపోయినా పరవాలేదు అనే ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా చూసినా అనంతరం ప్రేక్షకులు అందరి గురించి మాట్లాడుకున్నారు. కానీ దిశా పటాని గురించి ఎవరూ పెద్దగా ప్రస్తావించకపోవడం బాధాకరం. ఈ సినిమాలో ప్రభాస్ చేసిన భైరవ పాత్రను ఇష్టపడే అమ్మాయి పాత్రలో దిశా పటాని కనిపించింది.

కానీ వారిద్దరి మధ్య రొమాన్స్ వర్కౌట్ కాలేదు. వీరిద్దరి బంధాన్ని అందరికీ తెలియజేసే విధంగా ఎలాంటి సీన్స్ పెట్టలేదు నాగ్ అశ్విన్. వీరిద్దరి కాంబినేషన్లో ఓ పాట వచ్చినప్పటికీ ఆ పాటలో దిశా పటాని పెద్దగా గ్లామర్ గా కనిపించలేదు. దీంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ సినిమాలో దిశా పాత్ర అయిపోతుంది. ఆ పాట అనంతరం ఈ బ్యూటీ ఎక్కడ కనిపించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: