ప్రభాస్ హీరోగా చేసిన
కల్కి 2898 AD
సినిమా ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న సంగతి తెలిసిందే. ఈ
సినిమా యునానిమస్
బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.యంగ్
డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయగా మామయ్య
టాలీవుడ్ సీనియర్
నిర్మాత ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు.
ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో యూనివర్సల్
హీరో కమల్ హాసన్,
బాలీవుడ్ బిగ్ బాస్
అమితాబ్ బచ్చన్, నటి దీపికా పడుకోన్ ఇంకా దిశా పఠాని లు ముఖ్య పాత్రల్లో నటించారు.అయితే ఈ సినిమాలో నటించిన అందరికి ప్రశంసలు దక్కుతున్నాయి కానీ రాక్సీ పాత్ర చేసిన హాట్
బ్యూటీ దిశా పఠాని మాత్రం కనీస స్థాయిలో కూడా గుర్తింపు సంపాదించలేకపోయింది. ఆమె పాత్ర సినిమాలో ఉన్నా లేకపోయినా ఒకటే అన్న ఫీలింగ్ కలుగుతుంది.
సినిమా చూసి బయటికి వచ్చిన వాళ్లు మిగతా వారందరి పాత్రలు, వాటిని పోషించిన నటీనటుల గురించి మాట్లాడుకుంటున్నారు.కానీ ఎవ్వరూ దిశా గురించి పట్టించుకోట్లేదు.
సినిమాలో ప్రభాస్ చేసిన భైరవ పాత్రను ఇష్టపడే
అమ్మాయి పాత్రలో దిశా కనిపించింది. కానీ గ్లామర్ బాగానే చూపించినా రొమాన్స్ మాత్రం అస్సలు వర్కవుట్ కాలేదు. ఇద్దరి మధ్య మంచి సన్నివేశాలు రాసుకోలేదు నాగ్ అశ్విన్. ప్రభాస్-దిశా మీద ఒక పాట తీసినా కూడా అందులో ఆమె గ్లామరస్‌గా కనిపించింది కానీ పెద్దగా ఇంపాక్ట్ లేకపోయింది. ఆ పాట అవ్వగానే దిశ పాత్ర క్లోజ్ అయిపోతుంది.తర్వాత ఎక్కడా కూడా కనిపించదు. దాంతో అందరూ ఆమెను మరిచిపోతారు.మరోవైపు దీపికా పదుకొనే మాత్రం కీలకమైన పాత్రలో ప్రభాస్‌ను మించి హైలైట్ అయ్యింది.
సినిమా కథంతా ఆమె చుట్టూనే తిరగడం.. తన పెర్ఫామెన్స్ కూడా బాగుండడంతో మంచి పేరు వస్తోంది. దిశాకు మాత్రం ఈ
సినిమా వల్ల అస్సలు ప్రయోజనం లేదనే చెప్పాలి.గడిచిన 24 గంటల్లో
కల్కి సినిమాకి బుక్ మై షో లో ఏకంగా 1.28 మిలియన్ పైగా
టికెట్స్ అమ్ముడుపోయాయని సమాచారం తెలుస్తుంది.నిజంగా ఇదొక సంచలనం అని చెప్పాలి. ఇక శనివారం రోజు
కల్కి 2898 ఏడీ
మూవీ వరల్డ్ వైడ్‌గా ఏకంగా 117 కోట్ల గ్రాస్ ను దాటేసిందని తెలుస్తుంది.. అంటే మొత్తం మీద ఈ
సినిమా నిన్నటిదాకా 415 కోట్ల పైగా వసూల్ చేసింది..