కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న మరో ఐదుగురు.. బీఆర్ఎస్ పార్టీలో గుబులు..?

Pulgam Srinivas
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అత్యంత పోరాడిన రాజకీయ పార్టీలలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ ప్రధమ స్థానంలో ఉంటుంది. 2014 వ సంవత్సరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి అద్భుతమైన అసెంబ్లీ స్థానాలు దక్కాయి. దానితో కెసిఆర్ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2018వ సంవత్సరం జరిగిన రెండవ అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి మొదటి సారి కంటే ఎక్కువ స్థానాలు వచ్చాయి.

దానితో చంద్రశేఖర్ రావు రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2023 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఘోరమైన పరాజయం వచ్చింది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు రావడంతో ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

2023వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం దక్కడంతో కచ్చితంగా 2024 పార్లమెంట్ ఎన్నికలలో తమ ఉనికిని చాటుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎంతగానో కష్టపడ్డారు. కానీ వీరి పార్టీకి ఒక్కటంటే ఒక్క పార్లమెంటు స్థానం కూడా దక్కలేదు. ఇక దానితో ఈ పార్టీకి ఉనికి లేదని అనుకుంటున్నారో.. లేక ఇప్పట్లో పార్టీ పుంజుకోవడం కష్టం అనుకుంటున్నారో తెలియదు కానీ అనేక మంది కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. 

అందులో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలుగా గెలిచిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్యలు పార్టీకి గుడ్ బై చెప్పి కారు దిగేసి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఇక ప్రస్తుతం అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకరు హ్యాట్రిక్ ఎమ్మెల్యే గా గెలిచిన వ్యక్తి ఉన్నట్లు, అలాగే మాజీ మంత్రి ఒకరు కాగా, మరో ఇద్దరు హైదరాబాద్ సిటీకి చెందిన ఎమ్మెల్యేలు గాను ఇంకో ఇద్దరు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలుగా లీకులు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: