కల్కి 2898 AD : ఇప్పటివరకు 80% రికవరీ... కేవలం అన్ని కోట్లు వస్తే కల్కి హిట్..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి నాగ్ అశ్విన్ తాజాగా ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్గా కల్కి 2898 AD అనే పాన్ ఇండియా మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ లో అనేక మంది అత్యంత గుర్తింపు కలిగిన నటీనటులు నటించారు. ఇకపోతే ఈ సినిమా జూన్ 27 వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 5 రోజుల బాక్సాఫీస్ రన్ వరల్డ్ వైడ్ గా కంప్లీట్ అయింది. ఈ ఐదు రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధిస్తే ఈ మూవీ క్లీన్ హీట్ గా నిలుస్తుంది అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ కి 5 రోజుల్లో కలిపి నైజాం ఏరియాలో 59.19 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 14.08 కోట్లు , ఉత్తరాంధ్రలో 14.09 కోట్లు ,  ఈస్టు లో 8.41 కోట్లు ,  వెస్ట్ లో 6.25 కోట్లు ,  గుంటూరు లో 7.91 కోట్లు ,  కృష్ణ లో 7.56 కోట్లు ,  నెల్లూరు లో 4 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 5 రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 121.39 కోట్ల షేర్ ... 188.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. 5 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక లో 19.55 కోట్లు , తమిళ నాడు లో 11.80 కోట్లు , కేరళలో 6.20 కోట్లు ,  హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 65.30 కోట్లు , ఓవర్ సీస్ లో 73.80 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లో 298.04 కోట్ల షేర్ ... 571 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 370 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 372 కోట్ల బ్రేక్ ఈవేన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములాని కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకునేందుకు కావలసిన కలెక్షన్లలో దాదాపుగా 80 శాతం రికవరీని చేసింది. ఇక ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మరో 73.96 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: