ప్రజలకు ఎంతో మంచి చేసినా జగన్, కేసీఆర్‌లపై "నో" సానుభూతి..??

Suma Kallamadi
ఏపీలో జగన్ అనూహ్యంగా ఓడిపోయారు. తెలంగాణలో కేసీఆర్ కూడా కాంగ్రెస్ చేతిలో చిత్తుగా ఓడారు. ఎంపీ ఎన్నికల్లోనూ కేసీఆర్ కు దాదాపు జగన్ లాంటి అవమానక రావటమే ఎదురయింది. ఈ నేతలు బలహీనవంతులు ఏమీ కాదు. చాలా గట్టి వాళ్ళు. అలానే గడ్డు పరిస్థితులను ఎదుర్కొని ముఖ్యమంత్రులయ్యారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం పోరాడి తీసుకొచ్చారు. ఆ తర్వాత పది ఏళ్లు అధికారంలో ఉన్నారు. ఈ సమయంలో భగీరథ నీళ్లు తీసుకువచ్చారు. కళ్యాణ లక్ష్మి ప్రవేశపెట్టారు. 24 గంటల కరెంటు ఇచ్చారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయించారు. శాంతి భద్రతలను కాపాడారు. రైతుబంధు, దళిత బంధు వంటివి ప్రవేశపెట్టారు. 10 ఏళ్ల పాటు తెలంగాణలో ఏ ప్రతిపక్ష పార్టీ వైపు ప్రజలు చూడకుండా మంచి పరిపాలన అందించారు. గడిచిన 5 ఏళ్లలో కూడా బాగానే పరిపాలన అందించారు కానీ కొన్ని విషయాల్లో ఆయన తప్పు చేశారు. పేదలకు వెళ్లి ఇవ్వలేదు. దళిత బంధు పేరిట కొంతమంది దళితులకే డబ్బులు ఇచ్చారు. కింద స్థాయి నాయకులు చేసే అక్రమాలకు చెక్ పెట్టలేదు.
 కాంగ్రెస్ ప్రభుత్వం కంటే కేసీఆర్ ప్రభుత్వం సమర్థవంతమైనదే. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఎక్కువే పతకాలను అందించిందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఇప్పటిదాకా కాంగ్రెస్ కొత్త పెన్షన్లను ఇవ్వలేదు. కేసీఆర్ మాత్రమే పదేళ్లలో పెన్షన్లను నెలనెలా అందించారు. కొత్త పింఛన్లు ఇచ్చారు. కాంగ్రెస్ ఇంకా తులం బంగారం ఇస్తామని చెప్పింది కానీ ఇవ్వడం లేదు. 2500 ఇస్తామని మాటిచ్చారు ఇంకా అమలు చేయలేదు చాలానే హామీలు నెరవేర్చుకోలేకపోయింది. అయితే కాంగ్రెస్ చెప్పినవి చేయకపోయినా కేసీఆర్ అనవసరంగా ఓడించామని ప్రజల అసలు భావించడం లేదు ఆయనపై కొంచెం కూడా ప్రజలు సానుభూతి చూపించడం లేదు అందుకే ఎంపీ ఎన్నికల్లో సున్నా సీట్లు వచ్చేలాగా ఓడగొట్టారు.
 దీనికి ప్రధాన కారణం ఓడిపోయాక కూడా కేసీఆర్ ఫార్మ్ హౌజ్ కే పరిమితం కావడం, ప్రజలతో మమేకం కాకపోవడమే అని పలువురు చెబుతున్నారు. గద్దర్ వంటి ప్రజా గాయకులను కేసీఆర్ దూరం పెట్టారు. కోదండరాం లాంటి ప్రజా నాయకులను కూడా వెళ్లగొట్టారు. తెలంగాణా ఉద్యమంలో తన వెంట ఉన్న వారిని పూర్తిగా మరిచిపోయి ఓన్లీ కుటుంబ సభ్యులకే పదవులు ఇచ్చారు. కుటుంబ పాలన చేయడం దానిని సమర్థించుకోవడం వల్ల ప్రజలకు బాగా కోపం వచ్చింది. కాలేశ్వరం ప్రాజెక్టులో బయటపడిన లోపాలు కూడా కేసీఆర్ పై కోపాన్ని పెంచాయి.

ఇక ఏపీ విషయానికి వస్తే జగన్ 2024 ఎన్నికల్లో కేవలం 11 ఎమ్మెల్యే సీట్లతో పతనమయ్యారు. జగన్ హైవేలలో ఏపీని అభివృద్ధి చేసిందేమీ లేదు. అప్పులు చేసి బటన్ నొక్కుతూ సంక్షేమం చేస్తున్నానని చేతులు దులుపుకున్నారు. జగన్ కంటే ముందు ఇలా సంక్షేమం ఇచ్చి మంచి చేసిన నేతలు ఎవరూ లేరు అనేది కాదనలేని వాస్తవం. కానీ జగన్ సంక్షేమ పథకాలు ఒక్కడిదానిపైనే ఆధారపడ్డారు మిగతా వాటిని నిర్లక్ష్యం చేశారు. ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరినీ ఖాళీగా కూర్చోబెట్టి ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ వెళ్లారు. కింద జరుగుతున్న అక్రమాలను ఏమి అరికట్టలేదు.
 కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ సొమ్మును సాక్షి పేపర్ కు దోచి పెట్టారు. రోడ్లు కూడా వేయలేదు కానీ డ్రైవర్లకు వాహన మిత్ర పేరిట డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు కంటే రోడ్లు మంచిగా ఉంటేనే బాగుండేది అని డ్రైవర్లు ఫీలయ్యారు అయితే జగన్ ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయారు. రాజధానిని కూడా ఏర్పాటు చేయలేదు. రాజకీయ అనుభవం లేని సజ్జల రామ కృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, ఉన్నతధికారి ధనుంజయ్ రెడ్డి మాటలే విన్నారు ప్రజలు ఏమనుకుంటున్నారో ఏమీ తెలుసుకోలేకపోయారు. అందుకే ఆయన ఓడిపోయారు. హాయ్ రా తాను ఎందుకు ఓడిపోయాను తనకే తెలియడం లేదని వాపోతున్నారు. డబ్బులు ఇస్తూనే వేరే రూపంలో జగన్ ప్రజలను ఇబ్బంది పెట్టారని అందుకే ఆయనపై సానుభూతి ఎవరూ చూపించడం లేదని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: