జనసేన ఎమ్మెల్యేపై ప్రేమను చాటిన కార్యకర్తలు.. ఏం చేశారో చూడండి.!

Pandrala Sravanthi
 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో  ఈసారి జనసేన పార్టీ చరిత్ర సృష్టించింది. దేశంలో ఏ పార్టీ పోటీ చేసిన  సీట్లలో మొత్తానికి మొత్తం ఎప్పుడు కూడా గెలుచుకోలేదు. కానీ మొదటిసారి జనసేన పార్టీ ఆ రికార్డు నెలకొల్పింది.  మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 21 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తే, మొత్తానికి మొత్తం సీట్లు గెలుచుకుంది.  చాలామంది పేద, మధ్యతరగతి ఎమ్మెల్యేలే  జనసేన పార్టీ నుంచి గెలిచారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఈయన ప్రజానాయకుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఎలాంటి ఆస్తులు, అంతస్తులు లేకపోయినా ప్రజాసేవ చేస్తూ  ఈసారి ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో విజయం సాధించాడు. 

గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన ఎలాంటి నిరుత్సాహం చెందకుండా  ఎప్పుడు ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు వెళ్లాడు. ఆయన సేవలను గుర్తించినటువంటి జనసేన పార్టీ అసెంబ్లీ సీట్ కేటాయించింది. దీంతో ఈ సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించారు. అయితే బాలరాజు చిన్న సన్నకారు రైతు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి అసెంబ్లీకి వెళ్లాలన్న, నియోజకవర్గంలో తిరగాలన్న కారు లేక ఇబ్బందులు పడుతున్నాడు.   
ఈ విషయాన్ని గ్రహించినటువంటి జనసేన సైనికులు  తమ ప్రియతమ ఎమ్మెల్యే కోసం తల ఇంత చందాలు వేసుకొని  కొన్ని లక్షల వరకు నగదు పోగు చేశారు.

దీంతో టయోటా ఫార్చునర్ కారును బుక్ చేసి డౌన్ పేమెంట్ అందజేశారు. మిగతా అమౌంట్ ఈఎంఐ రూపంలో  ఎమ్మెల్యే బాలరాజు చెల్లించాలని తెలియజేశారు. ఈ విధంగా తన ప్రియతమ ఎమ్మెల్యేకు  వారు కార్ గిఫ్ట్ ఇవ్వడంతో  సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.అయితే ఈ కారును  కారాటం రాంబాబు సోదరుల చేతుల మీదుగా  జనసైనికులు ఈరోజు ఎమ్మెల్యే బాలరాజుకు అందజేశారు. రాంబాబు స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలరాజు  2019లో జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అయినా వెనక్కి తగ్గకుండా ప్రజలతో మమేకమై 2024 ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసి అద్భుతమైన మెజారిటీతో గెలుపొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: