రెడ్ బుక్ తెరిచిన లోకేష్.. ఇక వారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందేనా..?

Pulgam Srinivas
2019 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వై సి పి పార్టీకి 151 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. దానితో వై సి పి పార్టీ అధికారంలోకి వచ్చింది. వై ఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి సారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీకి చాలా తక్కువ మొత్తంలో అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. దానితో ఈ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఇక 2019 నుండి అనేక మంది వై సి పి పాలనలో అరాచకాలకు , దౌర్జన్యాలకు దిగారు అని , అలాంటి వారి పేర్లు ఒక రెడ్ బుక్ లో రాస్తున్నాను అని , మరికొన్ని రోజుల్లో ఎలాగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టి డి పి ప్రభుత్వం అధికారం లోకి వస్తుంది.

అలా అధికారం లోకి వచ్చాక వై సి పి పార్టీ అండ చూసుకొని అరాచకాలకు , దౌర్జన్యాలకు దిగిన వారందరికీ శిక్ష తప్పదు అని లోకేష్ హెచ్చరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగగా అందులో తెలుగుదేశం పార్టీకి భారీ మొత్తం లో స్థానాలు వచ్చాయి. దానితో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉంది.

ఇక మంగళూరు నుండి పోటీ చేసిన నారా లోకేష్ కూడా భారీ మెజారిటీతో గెలిచి ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఇక తెలుగు దేశం పార్టీ గెలవడంతో ఈయన తాజాగా రెడ్ బుక్ ను తెరిచినట్లు కనిపిస్తోంది. విశాఖ మధురవాడ లోని సర్వే నెంబర్ 411 , 412 , 419/1 , 419/3 లలో ఉన్న 97 ఎకరాల భూమి NCC , APHB కి సంబంధించిన ఫైలు దర్యాప్తునకు లోకేష్ ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఇక ఈయన తన రెడ్ బుక్ లో నుండి మరిన్ని విషయాలను బయటకు మరికొన్ని రోజుల్లోనే తెస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

nl

సంబంధిత వార్తలు: