ఏపీ అదనపు కార్యదర్శిగా ఆ ఐఏఎస్ ను స్పెషల్ గా కోరుకున్న బాబు.!

Pandrala Sravanthi
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదిరింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో పాలన మొదలై 20 రోజులు గడిచింది. ఈ తరుణంలో జగన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యదర్శులు ఇతర శాఖల ఉద్యోగులందరినీ ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేసి, వారికి నచ్చినటువంటి అధికా రులను ఏపీకి రప్పించుకుంటున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు.
ఇదే తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదనపు కార్యదర్శిగా  కార్తికేయ మిశ్రను ఏరి కోరి తెచ్చుకోబోతున్నట్టు తెలుస్తోంది. కార్తికేయ మిశ్రాను ఏపీ సర్వీసెస్ కు పంపాలని  చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారట. ఆయన లేఖకు స్పందించినటువంటి కేంద్ర డిఓపిటి  కార్తికేయ మిశ్రా ఆంధ్రప్రదేశ్ అదనపు కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసిందట. ఐఏఎస్ కార్తికేయ మిశ్రా ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి పరిధిలో ఆయన కింద ఏ శాఖలు ఉన్నాయో వాటన్నింటికీ  ముఖ్య కార్యదర్శులను  నియమించుకోవాలి.
దీనిలో భాగంగానే చంద్రబాబు అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ కార్తికేయను ఏరీ కోరి తెచ్చుకోబోతున్నారు. మిశ్రాను ప్రధానంగా కోరుకోవడం వెనుక ఒక అంశం దాగి ఉందట. మిశ్రా ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ డైరెక్టర్ గా ఉన్నారు. ఈయనకు ఆర్థిక అంశాలపై చాలా పట్టు ఉంది. కాబట్టి ఏపీ ఆర్థిక పరిస్థితి సెట్ అవ్వాలి అంటే కార్తికేయ మిశ్రా అయితేనే బాగుంటుందని ఏరికోరి ఆయనను చంద్రబాబు అదనపు కార్యదర్శిగా నియమించుకున్నారట. ఇక ఈయనే కాకుండా వ్యవసాయ, నీటిపారుదల శాఖలకు కూడా కేంద్ర సర్వీసులో సీనియర్ ఐఏఎస్ లను మాత్రమే నియమించుకోవాలని ఆలోచన చేస్తున్నారట. ఆ శాఖలకు కూడా త్వరలో సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించుకునే అవకాశం కనిపిస్తోంది. మరి చూడాలి ఆ మిగతా శాఖలకు ఏ ఏ అధికారులు వస్తారు అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: