Kalki 2898AD: 'కల్కి 2898 ఏడి' లో కైరా పాత్రలో నటించిన ఈ బ్యూటీ బ్యాగ్రౌండ్ ఇదే ?

Veldandi Saikiran
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ నటించిన తాజా చిత్రం "కల్కి 2898 ఏడి". ఈ సినిమా జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ అందుకుంది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

ఈ సినిమాలో విజువల్స్, కంటెంట్, విఎఫ్ఎక్స్, డైరెక్షన్ కు ఫిదా అయినటువంటి ఆడియన్స్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో స్టార్ నటీనటులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకి హైలైట్ అయ్యాయని చెప్పవచ్చు. ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీన్స్, మహాభారతం విజువల్స్ వంటి అంశాలతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కట్టిపడేసింది.

అంతేకాకుండా పురాణాలకు, కలియుగంతానికి, కల్కి అవతారానికి లింక్ పెట్టి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమా కథను తీశారు. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి ప్రతి ఒక్క ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంది. ఇక ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ నటినటులు నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇందులో కైరా పాత్రలో మెరిసిన నటి మరెవరో కాదు. మలయాళ నటి అన్నా బెన్. ఆమె ప్రముఖ మలయాళం స్క్రీన్ రైటర్ బెన్నీ నయరాంబలం కుమార్తె. ఈమె ఇప్పటివరకు మలయాళం సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక తెలుగులో ఈమె మొదటి సినిమా కల్కి కావడం విశేషం. అన్నా బెన్ మలయాళం సినిమాల్లోకి కుంభ నంగి నైట్స్ అనే సినిమాతో 2019లో పరిచయమైంది. ఆ సినిమా పెద్ద సంచలనమే సృష్టించింది. ఇక ఈ సినిమా నిర్మాతల్లో ప్రముఖ మలయాళం నటుడు ఫహద్ ఫాజిల్ కూడా ఉన్నారు. ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా అనంతరం అన్న బెన్ కు తెలుగులో వరుసగా అవకాశాలు వస్తాయని ప్రేక్షకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: