పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ ఇస్తే.. చివరికి చేతినే కోల్పోయింది?

praveen
ఈ మధ్యకాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయమే లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా మనీ వెంట పరుగులు పెడుతున్నాడు మనిషి. చివరికి ఆరోగ్యం చెడిపోయి సంపాదించిన మొత్తాన్ని కూడా ఆరోగ్యం బాగు చేసుకోవడానికి హాస్పిటల్లో ఖర్చు పెడుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటివి జరగకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచిస్తూ ఉంటారు నిపుణులు .

 అయితే కొంతమంది ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధతోనే ఉంటారు. ఏ చిన్న సమస్య వచ్చినట్లు అనిపించిన వెంటనే హాస్పిటల్కి పరుగులు పెడుతూ డాక్టర్ కి చూపించు కోవడం చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది  మాత్రం ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండడం కారణంగా.. కాస్త అతిగా ఆలోచిస్తూ ఉంటారు. దీంతో డాక్టర్ను సంప్రదించడం కాదు.. ఇక సొంత వైద్యం చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు సొంత వాయిద్యం చేయించుకోవడం వల్ల లేదంటే డాక్టర్లు నిర్లక్ష్యం చేయడం కారణంగా.. ఇక వైద్యం వికటించి చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే అని చెప్పాలి.

 సాధారణంగా బాడీపెయిన్స్ వచ్చినప్పుడు ఎవరైనా సరే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. కాస్త పెయింట్స్ ఎక్కువ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్లి ఇంజక్షన్ చేయించుకోవడం చేస్తూ ఉంటారు  అయితే ఒక మహిళ ఒళ్ళు నొప్పుల గురించి అన్ సర్టిఫైడ్ డాక్టర్ వద్దకు వెళ్తే వారికి త్వరగా ఉపశమనం కలిగించేందుకు పెయిన్ కిల్లర్ ఇంజక్షన్లు చేయడం చూస్తూ ఉంటాం. అయితే ఉత్తర ప్రదేశ్ కు చెందిన 32 ఏళ్ళ మహిళ ఇలాగే డాక్టర్ దగ్గరికి వెళ్తే పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ ఇచ్చారు. చివరికి ఇంజక్షన్ వల్ల ఆమె చేతిని కోల్పోయారు. లక్నో కేజీ ఎం యు చీఫ్ సర్జన్ సయ్యద్ ఈ విషయాన్ని వెల్లడించారు. తేలికపాటి నొప్పికి ఇంట్రా ఆర్టీరియల్ ఇంజక్షన్ చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురైంది అంటూ చెప్పుకొచ్చారు డాక్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: