కల్కి2898AD: కల్కి చిత్రంతో మరో రికార్డ్ బ్రేక్ చేసిన దీపికా..?

Divya
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో దీపికాపదుకొనే కూడా ఒకరు. ప్రస్తుతం పాన్ వరల్డ్ హీరోయిన్గా ఈ ముద్దుగుమ్మ తన బ్రాండ్ ని రోజురోజుకి పెంచుకుంటూనే ఉన్నది. అత్యధికంగా బ్రాండ్ వ్యాల్యూ కలిగి ఉన్న హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. కెరియర్ ప్రారంభంలో కన్నడలో ఉపేంద్రకు జోడిగా నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ నటించిన ఓం శాంతి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అక్కడినుంచి దీపికా పదుకొనే కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.

హాలీవుడ్ మూవీలో కూడా దీపికా పదుకొనే నటించేంతలా ఎదిగింది. ప్రస్తుతం ఇండియాలో అత్యధికంగా రేమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్గా పేరు సంపాదించింది. గత  ఏడాది షారుక్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ వంటి చిత్రాలలో కూడా నటించింది. ఈ రెండు చిత్రాలు రూ .1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడం గమనార్హం. బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్లు కలెక్షన్ సాధించిన చిత్రాలలో భాగమైన ఈ ముద్దుగుమ్మ ఒక అరుదైన ఘనతను కూడా సాధించింది. ఇప్పుడు తాజాగా కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ కు జోడిగా నటించిన దీపికా పదుకొనే ఈ చిత్రం  పాన్ వరల్డ్ చిత్రంగా విడుదల అయింది.

కల్కి చిత్రంలో ఈమె పాత్ర చాలా బలంగా ఉండేలా కనిపిస్తోంది. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో కలిసి సినిమా ఖచ్చితంగా రూ.1000 కోట్ల క్లబ్లో చేరుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ 1000 కోట్లకు పైగా కలెక్షన్ సాధిస్తే మూడు సినిమాలు 1000 కోట్ల చిత్రాలలో భాగమైన హీరోయిన్గా ఒక అరుదైన రికార్డును సంపాదించుకుంటుంది. కల్కి చిత్రంతో హాలీవుడ్లో మరింత గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని అభిమానులు తెలియజేస్తున్నారు. మొదటి రోజు 180 కోట్లకు సంపాదించిన కల్కి చిత్రం వీకెండ్ పూర్తి అయ్యేసరికి 500 కోట్లకు రీచ్ అవుతుందని నిపుణులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: