మెగాస్టార్ మాస్ రాజ్యం! అనిల్ రావిపూడితో చిరు ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్!
తాజా సమాచారం ప్రకారం, 'మన శంకర వర ప్రసాద్ గారు' మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా (ప్రీమియర్ షోలతో కలిపి) ఏకంగా ₹84 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. ఒక సీనియర్ హీరో సినిమా ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టడం ఇండియన్ సినిమా చరిత్రలోనే అరుదు. మెగాస్టార్ పాన్ ఇండియా చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' ఓపెనింగ్స్‌తో ఈ సినిమా సమానంగా నిలవడం చూస్తుంటే, బాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని అర్థమవుతోంది.తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ (US) మార్కెట్లో కూడా ఈ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. కేవలం ప్రీమియర్ షోల ద్వారానే $1.5 మిలియన్ మార్కును సునాయాసంగా దాటేసింది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతుండటంతో, వీకెండ్ నాటికి ఈ సినిమా మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం.
ఈ భారీ ఓపెనింగ్స్‌కు ప్రధాన కారణం చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడమే. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్ మరియు 'నందన' వైరల్ ఎపిసోడ్ ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్ పెడుతున్నాయి. దానికి తోడు నయనతార అందం, అభినయం సినిమాకు క్లాస్ టచ్ ఇచ్చాయి. ఫ్యామిలీస్ అందరూ ఈ సినిమాను పండగ ప్యాకేజీలా భావిస్తుండటంతో వసూళ్ల వర్షం కురుస్తోంది.మొదటి రోజు ₹84 కోట్లు అంటే అది మామూలు విషయం కాదు. నైజాం, సీడెడ్, ఆంధ్రా అనే తేడా లేకుండా ప్రతి ఏరియాలోనూ 'మన శంకర వర ప్రసాద్ గారు' ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్స్ సాధించారు. చాలా చోట్ల థియేటర్ల బయట 'హౌస్ ఫుల్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. సంక్రాంతి రేసులో ఇతర సినిమాలు ఉన్నప్పటికీ, మెగాస్టార్ తన మార్క్ 'మాస్' పవర్‌తో అందరికంటే ముందు నిలిచారు.
"తన పేరు మీద ఉన్న రికార్డులను తానే తిరగరాయడం" మెగాస్టార్ కి అలవాటే. ఇప్పుడు 'మన శంకర వర ప్రసాద్ గారు' చిత్రంతో అది మరోసారి రుజువైంది. ఫుల్ రన్ లో ఈ సినిమా ₹300 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.