భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ & రేటింగ్!
మాస్ మహారాజ్ రవితేజకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. అయితే ఈ మధ్య కాలంలో రవితేజ నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు. అయితే భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాతో రవితేజ ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ చేరుతుందని ఫ్యాన్స్ భావించారు. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు.
కథ:
రామ్ సత్యనారాయణ ఒక వైన్ యార్డ్ కు ఓనర్. ఒక బిజినెస్ డీల్ కోసం స్పెయిన్ కు వెళ్లిన రామ్ సత్యనారాయణ మానస శెట్టితో (ఆషికా రంగనాథ్) ప్రేమలో పడి ఫిజికల్ రిలేషన్ లోకి వెళ్తాడు. అయితే రామ్ సత్యనారాయణకు అప్పటికే పెళ్ళై ఉంటుంది. భార్యకు తన ఎఫైర్ గురించి తెలియకుండా రామ్ సత్యనారాయణ ఏం చేశాడు? ఈ కథను ఎలా ముగించారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :
టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు కిషోర్ తిరుమలకు ప్రత్యేకమైన శైలి ఉంది. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించే ఈ దర్శకుడు అటు రవితేజ అభిమానులు, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలను మిక్స్ చేసి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా నుంచి విడుదలైన వామ్మో వాయ్యో సాంగ్ కూడా సూపర్ హిట్ అయింది.
ఈ సినిమా స్టోరీ లైన్ కొత్తది కాకపోయినా రవితేజ మార్క్ సినిమాను చూడాలని భావించే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. రవితేజ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. డింపుల్ హయాతి పర్ఫామెన్స్ తో మెప్పించగా ఆషికా రంగనాథ్ గ్లామర్ తో మెప్పించారు. సత్య, వెన్నెల కిషోర్, సునీల్ కామెడీ సన్నివేశాలు సినిమాకు ప్లస్ అయ్యాయి.
టెక్నీకల్ గా కూడా ఈ సినిమా బాగుంది. భీమ్స్ మ్యూజిక్, బీజీఎంతో మెప్పించారు. కిషోర్ తిరుమల డైరెక్షన్ బాగుంది. కథ పరంగా వచ్చే కొన్ని ట్విస్టులు బాగున్నాయి. యూత్ ను, ఫ్యామిలీని ఆకట్టుకునేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. సినిమాటోగ్రఫీ టాప్ రేంజ్ లో ఉంది. ఎడిటింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది.
సంక్రాంతి పండుగ కానుకగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలవుతూ ఉండటంతో
బలాలు : రవితేజ నటన, కిషోర్ తిరుమల దర్శకుడు, సెకండాఫ్
బలహీనతలు : ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు
రేటింగ్ : 3.0/5.0