భర్త మహాశయులకు విజ్ఞప్తి.. సత్య కామెడీ డాన్స్ నెక్స్ట్ లెవెల్..!

Divya
టాలీవుడ్లో ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ బాగానే సక్సెస్ అవుతున్నారు. అలాంటి వారిలో కమెడియన్ సత్య కూడా ఒకరు. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బనవ్వించే సత్య, తాజాగా రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం (జనవరి 13) న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో సత్య నటించారు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా డాన్సర్ గా సత్య చేసిన కామిక్ పెర్ఫార్మషన్స్ , సినిమాలో కామెడీ టైమింగ్స్, తన ఎక్స్ప్రెషన్స్ తో అందరిని థియేటర్లో ఆకట్టుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ సైతం నవ్వేస్తున్నారు.



తాజాగా సత్య డాన్స్ వేసిన పాట దివంగత  నటులు శోభన్ బాబు, శ్రీదేవి జంటగా నటించిన దేవత చిత్రంలోని "ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ " ఇప్పటికీ ఎంతో మందికి ఫేవరెట్ సాంగ్. ఈ పాటనే పూజా హెగ్డే, వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన  గద్దల కొండ గణేష్ చిత్రంలో రీమేక్స్ చేశారు. ఇప్పుడు  అదే పాటని సరికొత్త రూపంలో తీసుకువచ్చారు డైరెక్టర్ కిషోర్ తిరుమల. భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రంలో ఈ పాటకు కమెడియన్ సత్య డాన్సులు వేయడంతో థియేటర్లలో ఈలలు కేకలతో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.


ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దీంతో రవితేజ అభిమానులు కూడా థియేటర్ల వద్ద సంబరాలు చేసుకుంటున్నారు. రవితేజకు జోడిగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి నటించారు. అలాగే ఇందులో వెన్నెల కిషోర్ సునీల్ తదితర నటీనటుల సైతం నటించారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి మొదటి రోజే రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో ఎలాంటి రికార్డులను తిరగరాస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: