పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి.. కేసిఆర్ కీలక వ్యాఖ్యలు?

praveen
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పాటుపడి.. తెలంగాణ ప్రజల గుండెల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న బిఆర్ఎస్ పార్టీ కథ ముగిసినట్లేనా అంటే గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అందరి నోటీ వెంట అవును అనే మాటే వినిపిస్తోంది. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న కారు పార్టీ ఒక్కసారి ప్రతిపక్షంలోకి రాగానే విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.

 గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ ఎలా అయితే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ఆకర్షించుకున్నారో.. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్న హస్తం పార్టీ కూడా ఇదే చేస్తుంది. కారు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరిని కూడా తమ గూటికి చేర్చుకోవడంలో సక్సెస్ అవుతుంది. ఇప్పటికే ఎంతో మంది ఎమ్మెల్యేలు అటు కారు దిగి చెయ్యందుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక రానున్న రోజుల్లో మరి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే అవకాశం ఉంది అని ఇక తెలంగాణ రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఇలా పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేల గురించి గులాబీ దళపతి కేసీఆర్ నోరు విప్పింది లేదు. ఇటీవల ఈ విషయంపై మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

 పార్టీని వీడి దొంగలతో కలిసినోళ్ల గురించి తనకు బాధ లేదు అంటూ కేసిఆర్ వ్యాఖ్యానించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కార్యకర్తలతో భేటీ అయ్యారు గులాబీ దళపతి  తెలంగాణ సాధించిన మనకు ఇదో లెక్కన.. పార్టీ నే నాయకులను తయారుచేస్తుంది. నాయకులు ఏమాత్రం పార్టీని ప్రభావితం చేయలేరు. మెరికల్లాంటి యువ నాయకులను సృష్టిద్దాం. రెట్టింపు ఉత్సాహంతో ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా పనిచేద్దాం అంటూ ఇక పార్టీ శ్రేణులు అందరికీ కూడా పిలుపునిచ్చారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే ఇలా పార్టీని వీడిన వారందరిపై విమర్శలు చేస్తున్న కేసీఆర్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తమ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న విషయాన్ని గుర్తుంచుకొని మాట్లాడాలి అంటూ కాంగ్రెస్ కౌంటర్లు ఇస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: