భారత్ కప్పు గెలుస్తుందా.. పాక్ మాజీ ఏమన్నాడంటే?

praveen
ఎన్నోరోజులుగా ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అసలు సిసలైన క్రికెట్ ఎంజాయ్మెంట్ ను అందిస్తూ వచ్చిన టి20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ ప్రస్తుతం తుది అంకానికి చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల ఇక ఈ వరల్డ్ కప్ లో సెమి ఫైనల్ మ్యాచ్ లు ముగియగా.. రేపు ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అయితే సెమి ఫైనల్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించి ఫైనల్ అడుగుపెడితే.. రెండో మ్యాచ్లో టీమ్ ఇండియా ఘన విజయాన్ని అందుకుంది ఫైనల్లో సౌత్ ఆఫ్రికా తో తలబడేందుకు సిద్ధమైంది.

 ఈ క్రమంలోనే రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో ఇక విజేతగా నిలిచి విశ్వవిజేతగా అవతరించే జట్టు ఏది అనే విషయంపైనే ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో చర్చ జరుగుతుంది అని చెప్పాలి. ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తమ అభిప్రాయం ప్రకారం వరల్డ్ కప్ ఫైనల్లో గెలవబోయే జట్టు ఏది అనే విషయంపై రివ్యూలు కూడా ఇచ్చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక ఫైనల్లో గెలుపు ఎవరిది అనే విషయంపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ వరల్డ్ కప్ టైటిల్ అందుకోవడానికి పూర్తి అర్హుడు షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు.

 టెస్ట్ ఛాంపియన్షిప్ వన్డే వరల్డ్ కప్ మిస్ అయిన భారత్ కు పొట్టి ప్రపంచకప్ నెగ్గె అర్హత ఖచ్చితంగా ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు ఈ పాకిస్తాన్ మాజీ ప్లేయర్. ఏ మాత్రం స్వార్థం లేని ఆటగాడు రోహిత్ శర్మ. స్వప్రయోజనాల కంటే జట్టే ముఖ్యం అని భావిస్తాడు. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు ఫైనల్ లో ఓడిపోయినప్పుడు ఎంతగానో బాధ కలిగింది. ఎందుకంటే ఆ జట్టు వరల్డ్ కప్ టైటిల్ గెలవడానికి అర్హత కలిగిన టీం అంటూ షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఈ పాకిస్తాన్ మాజీ ప్లేయర్ చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: