'కల్కి'లో పాత్ర పై.. మృనాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
ప్రస్తుతం ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసిన కూడా కల్కి మూవీ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా సెన్సేషన్ గా మారిపోయింది. మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ జోడించి ఫ్యూచరిస్టిక్ అనే కాన్సెప్ట్ తో నాగ్ అశ్విన్ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కింది అన్న విషయం తెలిసిందే.

 ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో అమితాబచ్చన్, కమలహాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని లాంటి ఎంతోమంది స్టార్స్ కూడా నటించారు అన్న విషయం తెలిసిందే. అయితే అఫీషియల్ గా వీరు మాత్రమే నటించారు అని చిత్ర బృందం  ముందుగా ప్రకటించింది. కానీ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులకు థియేటర్కు వెళ్లి చూస్తే మాత్రం ఇక మూవీలో ఉన్న స్టార్స్ అందరిని చూసి తెగ సర్ప్రైజ్ అయిపోతున్నారు అని చెప్పాలి. దాదాపుగా తెలుగు చిత్ర పరిశ్రమంలో ఉన్న ప్రముఖ హీరో హీరోయిన్లు అందరూ కూడా ప్రస్తుతం కల్కి మూవీలో క్యామియో రోల్స్ పోషిస్తున్నారు అని చెప్పాలి. అయితే సీతారామం బ్యూటీ మృడాల్ ఠాగూర్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించి సర్ప్రైజ్ చేస్తుంది.

 ఈ క్రమంలోనే  కల్కి సినిమాలో తన పాత్ర గురించి ఇక ఈ మూవీ చేయడం గురించి మాట్లాడిన ఈ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కల్కి 2898 సినిమాలో నటించాలని మూవీ టీం తన వద్దకు రాగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేసాను అంటూ మృనాల్ ఠాగూర్ చెప్పింది  నిర్మాతలు అశ్వినీ దత్, స్వప్న, ప్రియాంకతో నేను సీతారామం సినిమా చేశాను  వారి అభిరుచి పై నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే కల్కి 2898 లాంటి భారీ బడ్జెట్ సినిమాలో అవకాశం అనగానే వెనుక ముందు ఆలోచించకుండా ఓకే చెప్పేసాను అంటూ మృనాల్ ఠాగూర్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: