జగన్ కు మళ్ళీ లైఫ్ ఇస్తున్న మోడీ ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ... ఓటమిపాలైంది. ఎవరు ఊహించని విధంగా 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో ప్రతిపక్ష హోదా కూడా వచ్చే పరిస్థితి ఏపీలో కనిపించడం లేదు. ఈ తరుణంలో వైసీపీ పార్టీలో ఉన్న కీలక నేతలందరూ.... బయటకు వెళ్లేందుకు చూస్తున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత... వైసిపి ఫైర్ బ్రాండ్ నేతలను టార్గెట్ చేస్తోంది.

ఏదో ఒక రకంగా... వైసీపీ అగ్ర నేతలను ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందని వార్తలు వస్తున్నాయి. అలాగే కొంతమంది కేసులు ఉన్నాయని భయపడిపోతున్నారు. మరి కొంతమంది రాజకీయ భవిష్యత్తు కోసం... పార్టీ మారాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా బిజెపి పార్టీలోకి వైసిపి నేతలు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారట. టిడిపి అలాగే జనసేన పార్టీలోకి వెళ్లాలని ఇష్టంగా ఉన్నా కూడా... ఆ పార్టీ నేతలు రానివ్వడం లేదట.
 

కేవలం బిజెపి పార్టీ డోర్లు మాత్రమే ఓపెన్ గా ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఇటీవల పురందరేశ్వరి ఓ కీలక నిర్ణయం జగన్కు ఊపిరి పోసినట్లు అయిందని వార్తలు వస్తున్నాయి. అదేంటంటే... మరో ఆరు నెలల పాటు... వైసిపి నుంచి ఎవరిని చేర్చుకోకూడదని నిర్ణయం తీసుకున్నారట. ఆరు నెలల తర్వాత చూద్దాంలే అని అన్నారట. ఇప్పుడు చేర్చుకుంటే... ఎమ్మెల్యేలు లేదా ఎంపీల కంటే కేసులు  ఉన్న నాయకులు ఎక్కువగా వస్తారని వారు భావిస్తున్నారట.
 

అందుకే ఆరు నెలల తర్వాత... వైసీపీ నుంచి  నేతలను చేర్చుకోవాలని పురందరేశ్వరి అన్నారట. అలాగే ఇప్పుడు... ఎక్కువ రాజ్యసభ స్థానాలు ఉన్న జగన్మోహన్ రెడ్డిని... ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదని బిజెపి అధినాయకత్వం భావిస్తోందట.  రాజ్యసభలో ఏదైనా బిల్లు కోసం వైసిపి అవసరం వస్తుందని అనుకుంటున్నారట. 2026 వరకు బిజెపి, టీడీపీ సీట్లు రాజ్యసభలో పెరిగే అవకాశాలు లేవు. అందుకే ఇప్పుడు జగన్ ను గెలకడం మంచిది కాదని బిజెపి భావిస్తోందట. దీంతో జగన్ కాస్త రిలాక్స్ అయినట్లు తెలుస్తోంది. దింతో బయటికి వెళ్లాలనుకున్న నాయకులు వెళ్లకుండా... వైసిపి కోసం కష్టపడే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: