చెన్నై జట్టుకి మరో బిగ్ షాక్.. తిమ్మిర్లతో కుప్పకూలిన ప్లేయర్?

praveen
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ క్రికెట్ ఎంటర్టైర్మెంట్ ను ఎంజాయ్ చేసేందుకు భారత క్రికెట్ ప్రేక్షకులందరూ సిద్ధమయ్యారు. అయితే మార్చ్ 22వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబతుండగా.. మొదటి మ్యాచ్ లోనే చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. అయితే గత ఏడాది అద్భుతమైన ప్రదర్శన చేసి టైటిల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. ఇక ఇప్పుడు కూడా పక్క ప్రణాళికలతో టైటిల్ ఫేవరెట్  గా బరిలోకి దిగుతుంది. ధోని కెప్టెన్సీలో చెన్నై మరో టైటిల్ గెలవడం ఖాయం అభిమానులు అందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.

 అయితే మొదటి మ్యాచ్ లోనే అటు చెన్నై జట్టు బెంగుళూరు తో తలబడుతూ ఉండగా.. ఐపీఎల్ ప్రారంభానికి ముందు చెన్నై టీం కి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయ్. ఇప్పటికే జట్టులో స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్న డేవాన్ కాన్వే.. గాయం కారణంగా ఇక జట్టుకు దూరమయ్యాడు అని చెప్పాలి. దీంతో అతని స్థానంలో మరో ఆటగాడిని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక గత ఏడాది టైటిల్ గెలవడంలో కీలక పాత్ర వహించిన శ్రీలంక బౌలర్ పతిరణ సైతం గాయంతో కొన్ని మ్యాచ్లకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇలా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో మూడు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ కి మరో షాక్ తగిలేలాగే కనిపిస్తుంది.

 ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫేసర్ ముస్తాఫీజూర్ రెహమాన్ శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ సందర్భంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శరీరం అంతా తిమ్మిర్లు రావడంతో.. మైదానంలో అతడు నిలబడలేకపోయాడు. దీంతో మైదానంలోకి పరుగున వచ్చిన వైద్య సిబ్బంది.. ఏకంగా నడవలేని స్థితిలో ఉన్న ముస్తాఫీజుర్ రెహమాన్ ను స్ట్రక్చర్ పై మైదానం బయటికి తీసుకువెళ్లారు. దీంతో మరో మూడు రోజుల్లో అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదటి మ్యాచ్ ఆడుతుండగా.. అప్పటివరకు ముస్తాఫిజూర్ రెహమాన్ కోలుకుంటాడా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇలా చెన్నై జట్టుకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉండడంతో.. ఆ జట్టు వ్యూహాలు తారుమారు అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: